పదేళ్ల తరువాత మళ్ళీ వస్తున్నారంటే..!

India south africa t20 world cup final

నెల రోజుల నుండి క్రికెట్ అభిమానులను అలరిస్తున్న టీ-20 వరల్డ్ కప్ కు నేటితో తెర పడబోతోంది.ఈ గడిచిన మ్యాచ్ లలో ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. చిన్న టీంలు క్రికెట్ రాజ్యం లో ని దిగ్గజ జట్టులపై విజయ కేతనాన్ని ఎగరేశాయి. ఈ ఫైనల్ కు భారత జట్టు మరియు సౌత్ ఆఫ్రికా జట్టు అర్హత సాధించాయి. నేడు కింగ్స్టన్ ఓవల్ వేదికగా బార్బడోస్ లో ఈ ఫైనల్ పోరు జరగనుంది.

అయితే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకి గా మారవచ్చు అని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. భారత జట్టు మళ్ళీ పదేళ్ల తరువాత టీ-20 వరల్డ్ కప్ లో ఫైనల్ లో అడుగు పెట్టింది. 2014లో శ్రీలంక తో ఫైనల్ లో తలపడిన భారత్,మళ్ళీ ఈసారి ఫైనల్ కు పోరుకు సిద్ధమయ్యారు.

ADVERTISEMENT

సౌత్ ఆఫ్రికా జట్టు కూడా వారి క్రికెట్ చరిత్ర లో నే మొట్ట మొదటి సారిగా వరల్డ్ కప్ ఫైనల్స్ లో అడుగుపెట్టారు. 2014 లో ఇదే సౌత్ ఆఫ్రికా జట్టు ను సెమి ఫైనల్స్ లో ఓడించి భారత జట్టు ఫైనల్స్ కు చేరింది. నేడు తిరిగి వారితోనే ఫైనల్స్ కు సిద్ధమయ్యారు. ఐసిసి ఈవెంట్స్ లో నాక్ ఔట్స్ అంటేనే ఒత్తిడి లో కి వెళ్లే జట్టు లు గా పిలవబడే రెండు జట్టు లు నేడు ఫైనల్స్ ఆడనున్నారు.

భారత్ ఖాతా లో ఒక టీ-20 వరల్డ్ కప్ ఉన్నప్పటికీ, దాన్ని ముద్దాడి 17 ఏళ్ళు కావస్తుంది. ఇప్పటి వరుకు ఒక్క ట్రోఫీ కూడా లేని, అసలు ఫైనల్స్ కే చేరని సౌత్ ఆఫ్రికా నేడు వారి ఐసిసి కప్ దాహాన్ని తీర్చుకోవడానికి పక్కా ప్రణాళికలతో వస్తున్నారు. క్రికెట్ ప్రపంచ దిగ్గజులెందరో ఉన్న సౌత్ ఆఫ్రికా టీం ఇప్పటివరకు ఫైనల్స్ కు చేరకపోవడం ఒక ఆశ్చర్యం.

గత పదేళ్లుగా, ముగిసిన ప్రతి ఐసీసీ ఈవెంట్ లో ను సెమిస్ వరకు చేరి అక్కడ ఇంటి ముఖం పట్టడం, లేదా ఫైనల్స్ లో చేతులెత్తేయడం టీం ఇండియాకు అలవాటుగా మారిపోయిది. రోహిత్ శర్మ నేతృత్వం లో ఆడుతున్న మూడవ ఫైనల్ ఇది.

ఇప్పటికే టెస్ట్ మరియు 50 ఓవర్ల వరల్డ్ కప్ లో జట్టును ఫైనల్స్ వరకు తీసుకెళ్లిన రోహిత్, కప్ అందించలేకపోయారు. ఇక ఈసారి ఎలాగైనా గెలిచి, తన ఖాతాలో ఒక వరల్డ్ కప్ సాధించిన ఘనత దక్కించుకోవడంతో పాటు జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ కోచింగ్ గడువును ఘనమైన రీతిలో ముగించాలని మన జట్టు సైతం ఎంతో పట్టుదల తో ఉన్నారు.

అయితే మరొక విశేషం ఏంటంటే నేడు తలపడే రెండు జట్టులు ఈ వరల్డ్ కప్ లో ఓటమి ని చవి చూడలేదు. ఆడిన 8 కి 8 నెగ్గి ఫైనల్స్ కు చేరుకుంది సౌత్ ఆఫ్రికా. మరో పక్క ఆడిన 7 కు 7 గెలిచి ఫైనల్స్ కు అర్హత సాధించారు టీం ఇండియా.

ఇవాళ ఓటమి చెందిన జట్టు ఈ వరల్డ్ కప్ సిరీస్ లో మొదటి ఓటమి ను రుచి చూస్తారు. గతేడాది ముగిసిన వరల్డ్ కప్ లో కూడా భారత జట్టు ఇలాగే పది కి పది గెలిచి ఫైనల్ లో చతికిల పడ్డారు. 2014 తరువాత ఇప్పుడే ఫైనల్స్ కు చేరటం తో ‘పదేళ్ల తరువాత మళ్ళీ వస్తున్నారు’ చూడాలి మరి ఈసారి ఇండియా జట్టు చతికిల పడుతుందా.. పడేస్తుందా అని..!

India vs South Africa t20 world cup final who will win

ADVERTISEMENT
Latest Stories