బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత వెలువడిన డ్రగ్స్ దర్యాప్తుకు సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) నటీమణులు – రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే, మరియు శ్రద్ధా కపూర్‌లను ప్రశ్నించడం ముగించింది. అవసరమైతే మరోసారి ప్రశ్నించడానికి వారిని పిలిపించవచ్చని డిపార్టుమెంటు వారికి తెలిపిందట.
ఇకపోతే వారిని ప్రశ్నించిన సందర్భంగా వారి పర్సనల్ మొబైల్ ఫోన్లను ఎన్‌సిబి తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు ఈ ఫోన్ వ్యవహారం హీరోయిన్లకు తలపోటుగా మారింది. సహజంగా ఏ మనిషి గుట్టయినా అతని ఫోన్ లోనే ఉంటుంది. ఇక బాలీవుడ్ అంటే అఫ్ఫైర్లు, వారి ఆర్ధిక లావాదేవీలు, వివాదాలు వంటివి అన్ని వారి ఫోన్లలోనే ఉంటాయి.
ఇప్పుడు అది లేనిపోని తలపోటు తెచ్చిపెడుతుందా అని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ మధ్య డ్రగ్స్ కేసులోని విషయాలు వారికంటే కూడా ముందు మీడియాకు లీక్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ విషయాలు అన్ని లీక్ అయితే అసలుకే మోసం. మరోవైపు… బాలీవుడ్ తారలు తమ ఆదాయాలకు తక్కువ చేసి పన్ను ఎగ్గొట్టే పని కూడా చేస్తూ ఉంటారు.
ఇప్పుడు ఆ వివరాలన్నీ బయటకు పొక్కితే అసలుకే మోసం జరగొచ్చు. దీనితో ఈ పరిణామం ఎటుదారి తీస్తుందో అని వారు ఆందోళనగా ఉన్నారు. మరోవైపు దర్యాప్తు సందర్భంగా దీపికా అసలు కో-ఆపరేట్ చెయ్యలేదని వార్తలు వస్తున్నాయి. మిగిలిన వారు ఎక్కువగా నిందను సుశాంత్ మీదా, రియా మీదా నెట్టేసేప్రయత్నం చేశారట.



