లేచింది మహిళా లోకం…

Indian Women Shine Globally with Pride

సంస్కృతికి, సంప్రదాయాలకు పెద్ద పీట వేసే భారతదేశం మహిళల గౌరవానికి, వారి ఆత్మాభిమానానికి అంతే ప్రాధాన్యం ఇస్తారు. అయితే గతంలో మహిళలు ఇంటి గడప దాటి బయటకు రాకూడదు, దించిన తల పైకెత్తి చూడకూడదు, ఇతర పురుషులతో మాట్లాడకూడదు అనే నియమాలు, కట్టుబాట్లు స్త్రీ శక్తికి సంకేళ్లుగా మారాయి.

కానీ నేడు అదే మహిళ ఆ సంకెళ్ళ కంచెలను తెంచి ఒక భారత రాష్ట్రపతి ముర్ముగా, ఒక కల్నల్ సోఫియా గా, వింగ్ కమాండో వ్యోమిక సింగ్ గా, భారత ఉమన్ క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ గా ప్రపంచ దేశాల గుర్తింపు, గౌరవాన్ని పొందుతున్నారు.

ADVERTISEMENT

నాడు జరిగిన పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత ఆర్మీ చేప్పట్టిన ఆపరేషన్ సింధూర్ లో కల్నల్ సోఫియా, వింగ్ కమాండో వ్యోమిక సింగ్ అత్యంత ప్రముఖ పాత్ర పోషించారు, అలాగే భారత నారి శక్తిని శత్రు దేశంతో పాటుగా ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు.

ఇక నిన్న ముంబై డీవై స్టేడియం లో జరిగిన ఉమెన్స్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో ఉమన్ బ్లూ vs సౌత్ ఆఫ్రికా తలపడగా మన ఉమన్ భారత జట్టు సౌత్ ఆఫ్రికాను 52 పరుగుల తేడాతో మట్టికరిపించి ప్రపంచకప్ ను సొంత చేసుకుంది. ఆ దృశ్యాలు మైదానంలో ఉన్న వారినే కాదు టీవీ ల ముందు చూస్తున్న ప్రేక్షకులను సైతం భావోద్వేగాలకు గురి చేసాయి.

ఎన్నో ఏళ్ళ భారతీయుల కల, నిరీక్షణలకు నిన్న ప్రీతి కౌర్ నాయకత్వంలో సమాధానం దొరికింది. హర్మన్ ప్రీతి కౌర్ నేతృత్వంలో బరిలో దిగిన భారత మహిళా సేన గెలుపోటములను సమానంగా తీసుకుంటూ ఓడిన ప్రతి సారి గెలుపు కోసం రెట్టింపు ఉత్సహంతో బరిలోకి దిగింది.

అలాగే గెలిచిన ప్రతి మ్యాచ్ తరువాత అదే ఆట తీరును కొనసాగిస్తూ చివరికి ఉమెన్స్ ప్రపంచ కప్ ను భారతదేశానికి బహుమతిగా అందించారు. ఇలా ఒక్కో రంగంలోనూ మహిళలు పురుషులకు ఏమాత్రం తీసిపోము అనేలా అడుగు పెడుతూ తమ అడుగులను భవిష్యత్ భారతానికి మార్గదర్శకాలుగా మారుస్తున్నారు.

ఆటలలో, పాటలలో, నటనలో, రాజకీయాలలో, సైనిక విభాగంలో ఇలా ఏ రంగంలో అయినా నేను సైతం అంటూ ముందుకొస్తున్న భారత నారి శక్తి అందరికి స్ఫూర్తినియం. దీనితో ఎప్పుడో ఎన్టీఆర్ – సావిత్రి కలిసి నటించిన గుండమ్మ కథ సినిమాలో లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అన్న పాట ఇప్పుడు అందరికి గుర్తుకొస్తుంది.

ADVERTISEMENT
Latest Stories