ఫ్యాన్స్ కు “ఫెస్టివల్” స్టార్ట్స్!

IPL 2018 - MS Dhoni - Rohith Sharmaఇండియన్ క్రికెట్ అభిమానులకు అతి పెద్ద పండగ ప్రారంభం కాబోతోంది. ప్రతి ఏడు ఎంతగానో ఆదరణ పొందుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోన్న ఈ సీజన్ తొలి మ్యాచ్ లో 2017 ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో చిరకాల ప్రత్యర్ధి చెన్నై సూపర్ కింగ్ తలపడనుంది.

గత రెండు సీజన్లలో బహిష్కరణకు గురైన చెన్నై సూపర్ కింగ్ మహేంద్ర సింగ్ ధోని ఆధ్వర్యంలో రెట్టించిన ఉత్సాహంలో బరిలోకి దిగనుండగా, రోహిత్ శర్మ నేతృత్వంలో ముంబై ఇండియన్స్ మరోసారి చెలరేగడానికి సన్నద్ధం అవుతోంది. ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో కూడా జరగని విధమైన నాటకీయ పరిణామాలు ఐపీఎల్ లో చోటు చేసుకుంటాయి గనుక, ప్రతి ఏటా విజయవంతంగా జరుగుతోంది.

ADVERTISEMENT

శనివారం సాయంత్రం నుండి ప్రారంభం కాబోతోన్న మ్యాచ్ లు మే 27వ తేదీన జరిగే ఫైనల్ తో ముగియనుంది. ప్రతి జట్టు మరో జట్టుతో రెండు మ్యాచ్ లు ఆడనుండగా, టాప్ 4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్ కు ఎంపిక అవుతాయి. పదేళ్ళ తర్వాత కొత్త జట్ల సమీకరణలతో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories