ఈ నెల మొదటి వారం లో ముగిసిన ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య ముగిసిన టెస్ట్ సిరీస్ ను భారత జట్టు 4-1 తో కైవసం చేసుకుని క్రికెట్ అభిమానులకు కు కాస్త బ్రేక్ ఇచ్చారు. తాజాగా ఐపీల్ తొలి జాబితాలో మొత్తం 22 మ్యాచ్ల షెడ్యూల్ విడుదల చేసారు బీసీసీఐ.
అయితే కేవలం భారత అభిమానులనే కాక ప్రపంచవ్యాప్తి గా ఉన్న క్రికెట్ అభిమానుల ఎంటర్టైన్మెంట్ కు ఎటు వంటి డోకా లేని కాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ నేడే, ఓపెనింగ్ సెర్మనీ తో అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు కేవలం మన దేశంలోనే కాక ప్రపంచంలోని క్రికెట్ అభిమానులందరు తమకు ఇష్టమైన ఆటగాళ్ల కోసం ప్రతి ఏడాది కొన్ని కోట్ల సంఖ్యల్లో ఈ ఐపీఎల్ ను వీక్షిస్తుంటారు.
ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం ఈ ఐపీఎల్ 2024 మీద భారీగా అంచలాను పెంచటంతో, మరియు సీనియర్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని వంటి వారు తమ పాత్రలను మార్చుకుని, టీం కు కెప్టెన్ గా కాక కేవలం ఆటగాళ్లగా ఈ సీజన్లో అవతార మెత్తబోతున్నారు. అయితే ఈ సీజన్ కు ఓపెనింగ్ మ్యాచ్లో సిఎస్కె మరియు ఆర్సీబీ జట్టులు తలపడబోనున్నాయి.
ఈ సీజన్ ఓపెనర్ ను చెన్నై లోని చెపాక్ స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. ఇప్పటికే ఇరు జట్ల అభిమానులు తమ టీం ఈ సీజన్ మొదటి మ్యాచ్ ను గెలిచి, శుభారంభాన్ని ఇస్తాయి అని ఆశిస్తున్నారు. కాగా, భారత అభిమానులచే కింగ్ కోహ్లీ గా పిలవబడే విరాట్ కోహ్లీ మళ్ళీ మూడు నెలల తర్వాత క్రికెట్ గ్రౌండ్ లో దర్శనమివ్వనున్నారు.
ఇటు పక్క, కెప్టెన్ కూల్ గా పిలవబడే ఎంఎస్ ధోని కేవలం ఐపీఎల్ ఒకటే ఆడటం వలన ఆయన తిరిగి పది నెలల తర్వాత క్రికెట్ గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇవ్వటం తో,ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ కు అభిమానులు భారీ స్థాయి లో వత్తాస్సు పలుకుతూ వేల కొలది అభిమానులు ఇప్పటికే స్టేడియం లోనికి వెళ్లారు.
30000 సీటింగ్ కెపాసిటీ కలిగిన చేపాక్ స్టేడియం కు ఏకంగా ఒకలక్ష యాభై వేల మంది వెయిటింగ్ లో ఉన్నట్టు తెలిసింది. ఈ ఒక్క మాటతోనే అర్ధమవుతుంది ప్రేక్షకులు ఈ మ్యాచ్ కోసమై ఏ మేరకు ఆసక్తి ని చూపుతున్నారోనని. కాగా కేవలం ఈ ఒక్క మ్యాచ్ ఏ కాక, ప్రతి ఫ్రాంచైజ్ కు వేల మంది అభిమానులుంటారు. ప్రతీ సీజన్లో నరాలు తెగే ఉత్కంఠతో విజయం ఏ జట్టును వరిస్తుందో తెలియక ఆఖరి బంతి వరుకు ఎదురు చూసి ఫాన్స్ ఎంజాయ్ చేసే సన్నివేశాలెన్నో ఈ లీగ్ ఇప్పటికే చవిచూపింది.
ఇప్పటికే 16 సీజన్లు ముగవగా, ఇది 17 వ సీజన్, అందులో ‘ఎంఐ’ టీం మరియు ‘సిఎస్కె’ టీంలు చెరొక 5 సార్లు విజేతలుగా నిలిచారు. మొన్ననే ముగిసిన మహిళా ఐపీల్ లో ఫైనల్ విజేతగా ఐపీల్ కప్ అందుకున్నారు RCB – W టీం. చూడాలి మరి, ఆర్సీబీ అభిమానుల 16 ఏళ్ళ కోరిక ఈ ఏడాది ఐన నెరవేరుతుందేమో అని.




