బైటికే ఫెయిర్ అండ్ లవ్లీ.. లోపలంతా అన్ఫెయిర్ అండ్ లోన్లీ..!

IPL 2024 Royal Challengers Bengaluru

ఇప్పటికే ఐపీఎల్ మొదలయ్యి 16 సీజన్ లు పూర్తిచేసుకోగా, ఇటీవలే 17 వ సీజన్ కూడా ప్రారంభమయింది. అయితే జరిగిన ఈ 16 సీజన్ ల లోనూ ఒక జట్టు ప్రపంచం లో నే అగ్ర ఆటగాళ్లను జట్టులో ఉంచుకుని కూడా ఒక్కసారి కూడా ట్రోఫీ ని ముద్దాడలేదు అంటే నమ్మకతప్పదు.

ADVERTISEMENT

2008 లో మొదలైన ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు ఆనాటి అత్యుత్తమ ఆటగాళ్లు జహీర్ ఖాన్, డేల్ స్టెయిన్, కుంబ్లే,పాండే వంటి ఆటగాళ్లతో రాహుల్ ద్రావిడ్ సారధిగా బరిలోకి దిగగా, ఆ సీజన్ లో అనుకున్న మేరకు రాణించలేక సీజన్ ముగిసే సమయానికి టేబుల్ లో 7 వ స్థానానికే పరిమితమయ్యారు.

తరువాత సీజన్ 2009 లో నిలకడగా రాణించి ఫైనల్స్ కు చేరినా, ఫైనల్స్ లో మాత్రం విజయ తీరం వరుకు వచ్చి ఓటమి ని మూటగట్టుకుని వెళ్లారు. అలాగే 2011 సీజన్ లో కూడా ఇదే పరిస్థితి. ఇలా అప్పుడపుడు అలా ఫైనల్స్ వరుకు చేరుకొని, ఫైనల్స్ లో చేతులెత్తేస్తు వచ్చారు. అదే క్రమంలో జట్టు పగ్గాలను అందుకున్నారు విరాట్ కోహ్లీ.

ఇక కోహ్లీ కెప్టెన్సీ లో క్రిస్ గేల్, ఏ బి డే విల్లెర్స్, మిట్చెల్ స్టార్క్, రాహుల్,వాట్సన్ ఇలా ఎందరో స్టార్ ప్లేయర్లను కలిగి ఉన్నప్పటికీ మళ్ళీ 2016 లో అత్త్యుత్తమ ఆటతీరుతో ఫైనల్స్ వరుకు వెళ్లి, ఫైనల్స్ లో గొప్ప పోరాట పటిమ చూపి హైదరాబాద్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓడిపోయారు. ఇలా ఆ టీం మానెజ్మెంట్ సైతం ఎందరో గొప్ప ఆటగాళ్లను అనూహ్యంగా టీం నుండి వదిలేసుకుని ఫాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నారు.

ఆ టీం లో ఎందరో గొప్ప ఆటగాళ్లు ఉన్నపటికీ వారంతా అవసరమైన సమయాల్లో గ్రౌండ్ లో కన్నా డ్రెస్సింగ్ రూమ్ లో నే ఎక్కువ కనిపిస్తుంటారు, అంటూ విమర్శలు చేసారు మాజీ ఆటగాడు అంబటి రాయుడు. ఇలాంటి టీం ఎప్పటికి కప్పును అందుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు.

అలాగే వారి బాట్స్మన్ ఎన్ని పరుగులు చేసినప్పటికీ, తిరిగి వారి బౌలర్లు ధారాళంగా పరుగులను సమర్పించి మ్యాచ్ ను వారే అప్పోజిషన్ టీమ్ కు అందిస్తారు. అలాగే మొదటి ఇన్నింగ్స్ లో వారి బౌలర్లు ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ, ఛేదన లో వారి బాట్స్మన్ ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ కు చేరుతారు. కావలసిన సమయాల్లో ఆడగలిగే సామర్ధ్యం ఉన్నప్పటికీ వారు ఏ మేరకు ప్రభావం చూపలేక మ్యాచ్ ను ఓడిపోయినా సందర్భాలెన్నో ఉన్నాయి.

ఇలా ఆర్సీబీ టీం పై విమర్శలు ఈసారేమి కొత్త కాదు, ప్రతి ఏడాది ఆ టీం మొదటిలో మ్యాచ్లు గెలవగానే, ‘ఈ సాలకప్పు నందే’ అంటూ చేసే హడావిడీ కొత్తేమి కాదు.సీజన్ ముగిసే సమయానికి వారి ఫాన్స్ అంతా ట్రోలింగ్ కు గురి అవ్వడంతో వింతేమీ ఉండదు. పైగా ఈ సారి ఆర్సీబీ మహిళల జట్టు wpl లో కప్పు ను అందుకోటంతో ఈ సీజన్ ఆర్సీబీ మేన్స్ జట్టు కూడా బాగా రాణిస్తుంది అని ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీనితో జట్టుపై కూడా తెలియని ఒత్తిడి ఏర్పడింది.

ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్ లలో మూడింటిలో ఓటమి పాలయ్యారు. ఆ గెలిచిన ఒకటి సైతం విరాట్ మరియు చివర్లో కార్తీక్ మెరుపులతో విజయాన్ని అందుకున్నారు. ఇలా టీం లో విరాట్, మాక్స్వెల్,డు ప్లెసిస్ వంటి వారు ఉండటంతో ‘బైటకు అంతా ఫెయిర్ అండ్ లవ్లీ లానే కనిపిస్తున్నా, వారి ఫాన్స్ కు మాత్రం అంతా అన్ ఫెయిర్ అండ్ లవ్లీ’ మాదిరే ఉంది. చూడాలి మరి ఈసారి అయినా ఆ జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా తమ ఫాన్స్ 16 ఏళ్ళ కోరికను నెరవేరుస్తారో లేదో అని.

ADVERTISEMENT
Latest Stories