ఈసారి యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా పండగ మీదే కన్నేయడం, అది కూడా తన నుంచి ఆశించే క్వాలిటీ కంటెంట్ మూవీ కాకుండా అనగనగా ఒక రాజు లాంటి రొటీన్ మూవీతో రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేయడంలో ఎలాంటి సందేహం లేదు.
సినిమా ఆడలేదా అంటే దాని గురించి కాదు, నవీన్ కి ఇలాంటి బీటెన్ టు డెత్ టెంప్లేట్ అవసరమా అని?
నవీన్ చేసినవి మూడు సినిమాలే అయినా, ఆడియెన్స్ ఎంత సీరియస్ గా అతన్ని ఓన్ చేసుకున్నారనే దానికి అనగనగా కి ఇచ్చిన రిజల్ట్ ఒక కారణం.
అయితే మళ్లీ ఇలాంటి సినిమాతోనే మళ్లీ ఏదో ఒక పండక్కి వచ్చేద్దాం అనుకుంటే మాత్రం, ఇంతకు ముందు ఎంతో కష్టపడి సంపాదించుకున్న గుడ్ విల్ ఆవిరి అయిపోవడానికి పెద్ద టైం ఏమీ పట్టదు.
నవీన్ నుంచి ఎక్ష్పెక్త్ చేసే సినిమా, మేకింగ్ క్వాలిటీ లాంటివి పక్కన పెట్టేసినా, హీరో మేకప్ మీద కామెంట్స్ పడడం ఇబ్బందికర విషయమే తనకి. ఇక రేపు OTT లో పడ్డాక ఇవి ఇంకా ఎక్కువ హైలైట్ అవ్వచ్చు.
చూడాలి, నవీన్ పోలిశెట్టి సరయిన ఫీడ్బ్యాక్ చూడగలిగి, తన మార్క్ సినిమాతో వస్తాడో, లేదా మరో రొటీన్ సినిమా తో, ఆ నాలుగు రోజులు అయ్యాక గుడ్ విల్ లేని మరో ప్రాజెక్ట్ తో వస్తాడో.






