జగన్ విలువలకు ‘సాక్షి’ ప్రతిబింబమా..?

ys-jagan

విలువలు – విశ్వసనీయతే మా పార్టీ పునాదులు అంటూ విలువలు లేని రాజకీయాలు, విశ్వసనీయత లేని హామీలు ఇస్తూ ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వైసీపీ పార్టీకి, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు సాక్షి ప్రతిబింబంగా నిలిచింది అంటున్నారు మెగా అభిమానులు.

అన్న చేయూతతో ఇంతటి స్థాయికి వచ్చి కనీసం అన్న పేరు కూడా చెప్పుకోలేని పవన్ మెగాస్టార్ చిరంజీవిని అవమానిస్తున్నారని, ఆయన పట్ల పవన్ కు గౌరవమే లేదు అంటూ మీడియా ముందు చిరంజీవి మీద తమకున్న అవసరాన్ని, అవకాశాన్ని వాడుకున్న వైసీపీ, ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి గాను తాడేపల్లి లో సంధి చర్చలకు ఆహ్వానించి మెగాస్టార్ మీద జగన్ కున్న మర్యాదను, గౌరవాన్ని ఇండస్ట్రీ వర్గాలతో పాటుగా మెగా ఫాన్స్ కూడా కళ్లకుకట్టినట్టు చూపించారు సాక్షి మీడియా.

ADVERTISEMENT

వైసీపీ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థిస్తూ జగన్ కు మద్దతు తెలిపిన చిరంజీవి నాడు వైసీపీ కి దేవుడుగా మారితే…నేడు దెయ్యంగా ఎలా మారారో సాక్షిలో వస్తున్న కథనాలు చూస్తే అర్ధమవుతుంది. వైసీపీ దృష్టిలో మెగాస్టార్ ఇప్పుడు దిగజారిపోయారంట, ఎందుకంటే ఆయన తన ఆప్త మిత్రులకు ఎన్నికలలో మద్దతుగా నిలబడమే అందుకు కారణం. అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యరిగా పోటీచేస్తున్న సీఎం రమేష్, పెందుర్తి జనసేన అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న పంచకర్ల రమేష్ కు చిరంజీవి తన మద్దతు తెలిపారు.

తనకు ఎంతో ఆప్తులైన ఈ ఇద్దరి గెలుకు కోసం NDA కూటమికి నా మద్దతు తెలియచేస్తున్న అంటూ చిరు ఇచ్చిన ఒక్క ప్రకటన వైసీపీ నేతలకు, సాక్షి మీడియాకు బీపీలు తెప్పించాయి. దీనికి తోడు జనసేన పార్టీకి 5 కోట్ల విరాళం ఇచ్చి తమ్ముడికి తన ఆశీస్సులు అందించడం కూడా వైసీపీ నేతలతో పాటు సాక్షి మీడియాకు కూడా పని కల్పించాయి. మెగాస్టార్ ను టార్గెట్ చేస్తూ సాక్షిలో చర్చలు, డిబేట్లు, కథనాలు మొదలుపెట్టారు. ఈ రాష్ట్ర రాజకీయాల గురించి ఎవరు స్పందించిన, ఎవరు తన మద్దతు తెలపాలన్న అది వైసీపీ కె చెందాలి అనేలా జగన్, సాక్షిలు భావించడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అవుతుంది.

గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలోనూ ఇదే తీరుతో విమర్శలు చేసి అందరిని అవాక్కయ్యేలా చేసిన వైసీపీ, ఇప్పుడు చిరంజీవిని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. దీనికి ప్రతిస్పందనగా నిన్న జరిగిన ఎన్నికల ప్రచారంలో పవన్ వైసీపీ సోషల్ మీడియాకు, సజ్జలకు, వైసీపీ అధినేతకు హెచ్చరికలు పంపారు. చిరు లాంటి అజాత శత్రువు పై దాడి చేస్తూ చూస్తూ ఊరుకోనని జాగ్రత మాట్లాడాలంటూ వైసీపీ నేతలకు చాల ఘాటుగా బదులిచ్చాడు.

ఇదిలా ఉంటే తన అన్నకు వ్యతిరేకంగా తనకున్న ప్రజాస్వామ్య స్వేచ్ఛను వినియోగించుకుంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైస్ షర్మిల పైన, తన తండ్రి హత్యకు న్యాయం కావాలంటూ పోరాడుతున్న మరో సోదరి సునీత పైన, జగన్ సొంత చిన్నాన్న వివేక వ్యక్తిగత జీవితం పైన కుటుంబ విలువలకు తిరోధకలిచ్చి వ్యక్తిగత విమర్శలు చేస్తూ నడుపుతున్న సాక్షి కథనాలు జగన్ విలువలకు ప్రతిబింబాలే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

అలాగే తమకు అనుకూలంగా ఉంటే దేవుడని, తమ ప్రత్యర్థికి మద్దతు తెలిపితే రాక్షసుడని విశ్వసనీయత లేని విమర్శలు చేస్తూ విలువలు – విశ్వసనీయత అంటూ మాట్లాడడం వారి విశ్వసనీయతకే అద్దం పడుతున్నాడని సదరు సాక్షి గ్రహించాలి. ఒకప్పుడు షర్మిలను, చిరంజీవిని నెత్తిన పెట్టుకున్న వైకాపా నాయకులు ఇప్పుడు వారి పై కనీస సంస్కారం లేని విమర్శలు చేయడం వైసీపీ విధానాలను స్పష్టం చేస్తున్నాయి అంటున్నారు మెగా అభిమానులు.

ADVERTISEMENT
Latest Stories