వైఎస్ పార్టీ మీద ప్రేమతో చిన్న లాజిక్ మిస్ అయినట్టున్నారు?

IYR Krishna Rao IASఅమరావతి భూముల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని, ఆ మేరకు నమోదు చేసిన కేసులను ఏపీ హై కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ తరువాత చంద్రబాబుకు విరోధిగా మారిన ఐవైఆర్ కృష్ణారావు స్పందించిన తీరు అధికార పార్టీకి ఎప్పటిలానే అనుకూలంగా ఉంది.

ADVERTISEMENT

“ప్రభుత్వం తప్పకుండా అప్పీల్ చేయాల్సిన కేస్ ఇది. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే రాజధాని కృష్ణాతీరంలో ఉంటుంది అన్నారు కాబట్టి దీనిలో రహస్యం ఏమీ లేదు అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇది సరి కాకపోవచ్చు. ప్రత్యేకించి ఈ ప్రాంతంలోనే రాజధాని వస్తుంది అనే సమాచారం ఆ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిసే అవకాశం లేదు. అందుచేత తుది నిర్ణయం తీసుకున్న దాకా రాజధాని అంశం రహస్యంగానే సాగింది,” అని చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రి స్వయంగా ఒక హింట్ ఇచ్చాకా కూడానా ఆ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిసే అవకాశం లేదు అనడం ఏమిటో? పోనీ ముఖ్యమంత్రి, లేదా అప్పటి ప్రభుత్వ పెద్దలు కొందరికే ఆ సమాచారం చేరవేశారని ఎక్కడైనా సాక్ష్యం ఉందా? అటువంటిది లేనప్పుడు సాధారణ ప్రజలు సీఎం ప్రకటన, మీడియాలోని వార్తలు బట్టి అక్కడ భూములు కొన్నారు అనే అనుకోవాలి. గతంలో దొనకొండలో రాజధాని వచ్చే అవకాశం ఉందని వార్తలు వచ్చినప్పుడు అక్కడ కూడా భూములు కొన్నారు. రెండిటికి తేడా ఏముంది?

“ఒక ప్రైవేట్ కంపెనీ కి చెందిన రహస్య సమాచారంతో లబ్ధి పొందటమే నేరంగా భావించినప్పుడు, ప్రభుత్వం లోని రహస్య సమాచారం తో లబ్ధి పొందటం అంతకు మించిన నేరం అవుతుంది. ఈనాడు ఈ కోర్టు తీర్పు ఒక్క అమరావతి అంశానికే పరిమితం కాదు. రేపు ఏ ప్రాజెక్టు విషయంలోనైనా రహస్య సమాచారం ఉన్న ఏ అధికారి అయినా చుట్టుపక్కల భూములు కారుచౌకగా కొని ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఎక్కువ ధరలకు అమ్ముకున్న ఈ తీర్పు ప్రకారం చట్టరీత్యా నేరం కాదు. దాని పరిణామాలు పాలనా వ్యవస్థ పై విపరీతంగా ఉంటాయి, అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

అమరావతి రాజధాని అని అప్పటి ముఖ్యమంత్రే బహిరంగంగా చెప్పినందున అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ప్రస్తావనే రాదు. ప్రభుత్వం లోని రహస్య సమాచారం కానీ కాదు. రేపు ఏ ప్రాజెక్టు విషయంలోనైనా చుట్టుపక్కల భూములు కారుచౌకగా కొని ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఎక్కువ ధరలకు అమ్ముకున్న ఈ తీర్పు ప్రకారం చట్టరీత్యా నేరం కాదు అంటూ ఐవైఆర్ అనుమానం వ్యక్తం చేశారు. కొంత వరకు అందులో నిజం ఉన్నప్పటికీ దేశంలో ఇప్పటివరకు ఇది జరుగుతున్న సర్వసాధారణ విషయమే కదా? ముందుగా అధికారులు, రాజకీయ నాయకులు కొనుకోవడం… తరువాత మీడియా వార్తల ద్వారా రియల్ ఎస్టేట్ వారు దిగిపోవడం. అసలు దేశం లోని రియల్ ఎస్టేట్ అంతా ఈ సూత్రం మీదే నడుస్తుంది ఈరోజు రేపు.

ADVERTISEMENT
Latest Stories