ఆ లాజిక్ ప్రకారం జగన్ ప్రభుత్వం మీద కూడా మ‌ర్డ‌ర్ కేసు పెట్టాలి!

Jagan Government
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో రాజకీయ పార్టీల సభలు, ర్యాలీలు నిలువరించలేకపోయినందుకు ఎన్నికల కమిషన్ కు మద్రాస్ హై కోర్టు చివాట్లు పెట్టింది. “మీ మీద మ‌ర్డ‌ర్ కేసు పెడితే స‌రిపోతుంది. ఇక్క‌డా (త‌మిళ‌నాడు), దేశంలోనూ కొవిడ్ సెకండ్ వేవ్ పెర‌గ‌డానికి మీరే కార‌ణం. అత్యంత బాధ్య‌తా ర‌హిత సంస్థ” అని చీఫ్ జ‌స్టిస్ సంజీవ్ బెన‌ర్జీ, జ‌స్టిస్ సెంథిల్‌కుమార్ రామ‌మూర్తిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తీవ్రంగా స్పందించింది.

అయితే దీనిని ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కి అన్వయించి మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద కూడా ఇలాగే మ‌ర్డ‌ర్ కేసు పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన గతంలో ప్రభుత్వం వద్దన్నా కోర్టుకు వెళ్లి మరీ ఎన్నికలు పెట్టించారు అని వారి వాదన. అయితే వారు ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు.

ADVERTISEMENT

నిమ్మగడ్డ ఎన్నికలు పెట్టినప్పుడు కేసులు తక్కువ… మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది ఇప్పుడు కేసులు దేశంలో ఉదృతంగా ఉన్నప్పటి గురించి. నిమ్మగడ్డ వాదనను అప్పట్లో కోర్టులు కూడా సమర్ధించాయి కాబట్టి ఇక దాని మీద ఎటువంటి చర్చకు తావు లేదు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఆ లాజిక్ ప్రకారం జగన్ ప్రభుత్వం మీద కూడా మ‌ర్డ‌ర్ కేసు పెట్టాలి.

మొదట్లో నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేసేటప్పుడు… అలాగే ఆయన దిగిపోయేటప్పుడు మిగతా ఎన్నికలు కావాలని అధికార పార్టీ గట్టిగా డిమాండ్ చేసింది. ఆయన దిగిన వెంటనే కొత్త ఎన్నికల అధికారితో ఎన్నికలు జరిపించుకున్నారు కూడా. ఆ లాజిక్ ప్రకారం వెళ్తే ఏపీ ప్రభుత్వం మీద కూడా మర్డర్ కేసు పెట్టాలని సోషల్ మీడియా అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories