సంక్రాంతి రిలీజ్ కుదర్లే… దసరా ముహూర్తం ఫిక్స్?

Jagan plans Dasara release date with political schedule and public meetings


పెద్ద సినిమాలు సంక్రాంతికి లేదా దసరా, దీపావళి పండుగల సమయంలోనో విడుదల చేస్తామని ప్రకటిస్తుంటారు. ఆ ప్రకారమే అన్నీ ప్లాన్ చేసుకొని ప్రమోషన్స్ ప్రారంభిస్తారు. కొన్నిసార్లు సినిమా సంక్రాంతికి రావాల్సిన సినిమా ఆలస్యమైతే ఉగాదికో శివరాత్రికో విడుదల చేస్తుంటారు.

జగన్‌, కేసీఆర్‌ కూడా అలాగే సంక్రాంతికి రిలీజ్ అవుతారని మీడియాకు లీకులు ఇచ్చారు. సినిమాలు ఆలస్యమైతే సీజీ పనులు అవలేదని చెప్పుకోవచ్చు. కానీ జనవరిలో సంక్రాంతికి రిలీజ్ అవుతామని చెప్పుకున్న జగన్‌, కేసీఆర్‌ ఆగస్ట్ 15కి కూడా రిలీజ్ కాకపోవడానికి కారణం ఏమిటో చెప్పనే లేదు.

ADVERTISEMENT

కేసీఆర్‌ ఇప్పుడప్పుడే ఫామ్‌హౌసు నుంచి రిలీజ్ అయ్యే సూచనలు కనపడటం లేదు. కానీ జగన్‌ మాత్రం దసరా రిలీజ్‌కి కొత్త ముహూర్తం పెట్టుకుంటున్నట్లు తాజా సమాచారం.

ముందుగా పార్టీ నేతలతో సమావేశమయ్యి షెడ్యూల్ ఖరారు చేసుకున్నాక ముహూర్తం పోస్టర్‌, రిలీజ్ డేట్ ప్రకటిస్తారని, ఆ తర్వాత ‘పింఛన్లు కోత’పై రాజమండ్రి లేదా కర్నూలులో నిరసన కార్యక్రమం నిర్వహించి దానిలో జగన్‌ స్వయంగా పాల్గొంటారని సమాచారం.

ఈ ముహూర్తానికి ఎటువంటి ఆటంకాలు (మద్యం కుంభకోణం కేసులో విచారణకు పిలుపులు లేదా అరెస్ట్‌ వంటివి) లేకుండా ఈ కార్యక్రమం జరిగిపోతే, ఆ తర్వాత జగన్‌ జిల్లా పర్యటనలు మొదలుపెట్టవచ్చని తెలుస్తోంది.

ఒక్కో జిల్లాలో రెండేసి రోజులు చొప్పున పాదయాత్రో మరొకటో చేస్తూ ప్రజల మధ్యకు జగన్‌ వచ్చేస్తారట! కనుక ముందుగా రిలీజ్ పోస్టర్‌ వచ్చేస్తే నీరాజనాల ఏర్పాట్లకి వైసీపీ నేతలందరూ సన్నాహాలు చేసుకోవలసి ఉంటుంది. అలాగే టీడీపి కూడా!

ADVERTISEMENT
Latest Stories