jagan-mohan-reddy-political-preachings

సాధారణంగా ప్రవచనాలు అనగానే చాగంటి కోటేశ్వరావు గారు, గరికపాటి వెంకటేశ్వర రావు గారు అందరికి గుర్తొస్తారు. అయితే వీరు ఆధ్యాత్మిక ధోరణిలో, మనిషి మెరుగైన జీవన శైలికి అవసరమైన విధానాల మీద తమ అనుభవాన్ని, తమ సాహిత్యాన్ని, తమ పాండిత్యాన్నీ రంగరించి ప్రవచనాలు వల్లెవేస్తూ ఉంటారు.

అయితే వీరి ప్రవచనాల ఫలితంగా సమాజానికి ఎంత మేలు జరుగుతుందో చెప్పలేం కానీ ఎటువంటి కీడు మాత్రం జరగదు అని చెప్పవచ్చు. కానీ వైసీపీ అధినేత వైస్ జగన్ తన పార్టీ శ్రేణులను ఉద్దేశించి చేసే రాజకీయ ప్రవచనాలు మాత్రం సమాజానికి అత్యంత హానికరంగా మారుతున్నాయి.

Also Read – హిందీ భాష పై బాబు స్పందన…

రాజకీయాలలో ఏది మంచి, ఏది చెడు, తమ పార్టీ కార్యకర్తలు సమాజం పై ఎంత బాధ్యతగా మెలగాలి, రాజకీయాలలో ఎటువంటి వాటికి చోటు ఉండాలి, ఎటువంటి వాటిని విడిచిపెట్టాలి అని జగనన్న మాటలలో…

* పార్టీ క్యాడర్ అంటే పార్టీ కోసం, పార్టీ అధినేత మెప్పు కోసం ఏ స్థాయికైనా దిగజారిపోవచ్చు, ఏ స్థాయికైనా బరితెగించవచ్చు.

Also Read – కమల్‌ హాసన్‌కి మాత్రమే న్యాయం…. చాలుగా!

* జగన్ విధానాలను వ్యతిరేకిస్తే సొంత తల్లైనా, చెల్లైనా సహించేది లేదు, ఉపేక్షించాల్సిన అవసరం లేదు.

* అలాగే జగన్ అడుగులకు మడుగులొత్తే వారు హంతకులైన, నేరస్తురాలైన, అరాచకవాదులైనా సరే వారికీ ఉన్నత స్థాయిలు, వారికీ జగన్ అండ, ఆదరణ దక్కుతుంది. వీటికి చక్కని ఉదాహరణలుగా కొన్ని అంశాలు….

Also Read – ఇండోసోల్ నిర్వాసితులను జగనే కాపాడాలట!

* సొంత బాబాయిని చంపిన కేసులో ప్రధమ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న వైస్ అవినాష్ రెడ్డి జగన్ దృష్టిలో చిన్నపిల్లాడు….

* రోడ్ల మీద అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ, గంజాయి వాడుతున్న వారు జగన్ కి అమాయకులు, చిన్నపిల్లలు….

* రాజకీయాలకు సంబంధం లేని మహిళలను చట్ట సభలలో అవమానించే అరాచకవాదులు జగన్ కళ్ళకి అందగాళ్ళు…

* రప్పా రప్పా నరుకుతాం అంటూ హింసను ప్రోత్సహించే వారు జగన్ దృష్టిలో వైసీపీ సైన్యం…

* సమాజం కూడా సిగ్గుతో తలవంచుకునేలా ప్రత్యర్థి పార్టీల కుటుంబాల మీద విమర్శలు చేసిన పోసాని వంటి వారు అమాయకులు…

* రాష్ట్ర రాజధాని పై, అక్కడి ప్రాంత మహిళల పై అత్యంత హీనంగా మాట్లాడే జర్నలిస్టులు పెద్ద మనుషులు…

* ప్రత్యర్థి పార్టీల కార్యాలయాల మీద దాడులకు తెగబడుతున్న వారు, సొంత తల్లి, చెల్లి మీద వ్యక్తిగత విమర్శలు చేసే వారు, సోషల్ మీడియాలో ఉన్మాద చర్యలకు తెగబడే వారు జగన్ దృష్టిలో అత్యంత సౌమ్యులు, మంచివారు.




ఇలా వైస్ జగన్ తన పార్టీ సిద్ధాంతాలను, తన విధానాలను తన పార్టీ క్యాడర్ ప్రవర్తనను ప్రవచనాలు రూపంలో సమాజానికి ఒక సందేశాన్ని అందిఇస్తున్నారు. అయితే ఇలా జగనన్న చెపుతున్న ప్రవచనాలను విని ఉరుకుంటే పర్లేదు కానీ వాటిని ఆచరణలో పెట్టాలనో, వాటిని ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందాలని చూస్తే మాత్రం ‘అరెస్టులు’ అనే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.