జగన్ పాదయాత్ర స్వల్ప వాయిదా!

YS Jagan Padayatra Postponedజగన్‌ పాదయాత్రలో స్వల్ప మార్పులు చేసుకునే అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నవంబర్‌ 2కు బదులుగా 6న పాదయాత్ర ఉండే అవకాశం కనిపిస్తుంది. వ్యక్తిగత హాజరు నుండి సీబీఐ కోర్టు జగన్‌కు అనుమతివ్వకపోవడంతో పాదయాత్రలో మార్పు చేయనున్నట్లు సమాచారం.

ADVERTISEMENT

నవంబర్ 2న పాదయాత్ర మొదలు పెడితే మళ్లీ 3 శుక్రవారం కోర్టుకు వెళ్ళాలి. రెండో రోజే పాదయాత్రకు బ్రేక్ వేస్తే ప్రజల్లో నెగేటివ్ ఫీలింగ్ వస్తుందని పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు పాదయాత్ర డేట్ మారడం ఇది రెండో సారి. మరోవైపు నవంబర్ 10 నుండి జరిగే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

6 నెలల పాటు 3600 కిలోమీటర్ల దూరం నడవాలని ఆయన ప్రణాళిక. ఈ ప్రక్రియలో ఆయన 120 నియోజకవర్గాలను కవర్ చెయ్యబోతున్నారు. ఈ పాదయాత్ర ఆయనను ముఖ్యమంత్రి సింహాసనంలో కూర్చోబెడుతుందని ఆయన నమ్మకం.

ADVERTISEMENT
Latest Stories