జగన్ సమర్ధుడు కాదా?

jagan special status for Andhra Pradeshజూన్ నెల రెండో భాగం జగన్ ప్రభుత్వానికి ఎందుకనో కలిసి రానట్టుగా ఉంది. జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు ఎదురుకుంది. గత ఎన్నికలలో యువత, నిరుద్యోగులు పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. అయితే ఈ జాబ్ క్యాలెండర్ విషయంలో జగన్ వారి మద్దతు కోల్పోతున్నట్టుగా ఉంది.

ఇదే అవకాశాన్ని అదనుగా తీసుకుని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రజావ్యతిరేకత ను ఎక్కువ చేసి పనిలో పడింది. ఇందులో భాగంగా 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ విడుదల చేసిన ప్రకటనలను సోషల్ మీడియాలో తిప్పి పరువు తీస్తున్నారు. ఒక యాడ్ లో ఇంటర్వ్యూకి వెళ్లిన ఒక యువకుడు తాను రిజెక్ట్ అయ్యాకా ప్రత్యేక హోదా మా జగనన్న తెచ్చి ఉద్యోగం ఇప్పిస్తాడు అని గట్టిగా చెబుతాడు.

ADVERTISEMENT

ఇంటర్వ్యూ చేసే అతను ప్రత్యేక హోదా తేవడం అంత తేలిక కాదు అంటే… అసమర్ధుడు వంకలు వెతుకుతాడు… సమర్ధుడు సాధించి చూపిస్తాడు అని సవాలు చేస్తాడు. ఇప్పుడు జగన్ సమర్ధుడు కానట్టే కదా అంటూ ఆ వీడియోని టీడీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉన్న కారణంగా ప్రత్యేక హోదా ఇవ్వమని బ్రతిమాలడం తప్ప తాము చెయ్యగలిగింది ఏమీ లేదని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే పలుసందర్భాలలో తేల్చి చెప్పారు. అయితే చంద్రబాబు హయాంలో కూడా బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో మాత్రం జగన్ ఏ విధంగా డిమాండ్ చేసే వారో తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories