దగ్గరి చెల్లికి లేని ఓదార్పు దూరపు తమ్ముడికా?

YSJagan_YS_Avinash_Reddy_SunthaReddy_SharmilaReddyవైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరచూ “అమ్మకి అన్నం పెట్టలేనివాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తానన్నాడంట” అనేవారు. ఇప్పుడు ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి కేసు విషయంలో, వైయస్ తనయుడు జగన్ రెడ్డి తీరు వైయస్ సామెత చెప్పిన చందంగానే ఉందని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. హత్య గావించబడింది జగన్ రెడ్డి సొంత బాబాయి, ఆ హత్యపై సానుభూతిని అస్త్రంగా మార్చుకుని, దానిని గుండెపోటు అంటూ మెుదలు పెట్టి, హత్య వార్త బయటపడగానే, అప్పటి ముఖ్యమంత్రి మీదే తన సొంత మీడియాల్లో పదే పదే ఆరోపణలు గుప్పించి అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. ఆయన ముఖ్యమంత్రి కావడంతో వివేకానంద రెడ్డి హత్య కేసు కొలిక్కి తెచ్చి నిందితులకు శిక్ష వేయిస్తారని వివేకా కుమార్తె డా. సునీత రెడ్డి తో పాటు రాష్ట్ర ప్రజలంతా అనుకున్నారు. కానీ జరుగుతున్న పరిణామాలు అందరి అంచనాలను తలకిందులులచేస్తున్నాయి.

ఆయన అధికారంలోకి రాగానే ఆయన గతంలో కోరిన విధంగా సిబిఐ ధర్యాప్తుకి సిఫార్సు చేస్తారనుకున్నారు, కానీ ఆ పని చేయకపోగా అప్పటి వరకూ చురుగ్గా దర్యాప్తు చేసిన సిట్ ని మార్చి తనకు కావలిన అధికారులను నియమించుకున్నారు. కనీసం తన పర్యవేక్షణలో కేసును తొందరగా ఛేదిస్తారని ఆయన అభిమానులు ఆశ పెట్టుకున్నారు, అది జరుగకపోగా కేసుని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారు. దాంతో ఆయన చెల్లి డా. సునీత కంగుతిని, తన తండ్రి హంతకులకు శిక్ష పడాలని సొంతగా పోరాటం మెుదలు పెట్టారు. కుటుంబం బుజ్జగింపులు, బయట నుంచి బెదిరింపుల మద్య ఆవిడ పోరాటం ఫలించి కోర్టు ఆదేశాలతో కేసు సిబిఐకు బదిలీ అయ్యింది. కానీ అక్కడ నుంచి అడుగు ముందుకు పడలేదు, పైగా దర్యాప్తు అధికారిపై ఎదురు కేసులు, సహాయ నిరాకరణ. మళ్లీ సునీత గారే కోర్టు తలుపు తట్టి కేసు తెలంగాణకు మార్చాలని పోరాడి సాధించారు. అక్కడ నుంచి కాస్త వేగం పుంజుకున్న దర్యాప్తు పులివెందులలో తీగలాగితే, తాడేపల్లి డొంక దాకా వచ్చింది. అన్ని వేళ్లు ఆ కుటుంబానికి బంధువు, కడప యంపి అయున అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కరరెడ్డి వైపు చూపించడం మెుదలైంది. ఇంక అప్పటి నుంచి జగన్ పదే పదే చేస్తున్న ఢిల్లీ యాత్రలు జనాలకు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. సిబిఐ అరెస్ట్ వార్తల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల మద్యలో హడావుడిగా ఒకసారి వెళ్లివస్తే, తాజాగా అవినాష్ రెడ్డి కేసుపై కోర్టులో వాదనల నేపథ్యంలో విశాఖలో జరుగుతున్న ప్రతిష్టాత్మక జి-20 అధికారుల సదస్సు వదిలి మరీ ఢిల్లీలో మకాం పెట్టడం పలు చర్చలకు తావిచ్చింది.

ADVERTISEMENT

ఇక్కడ చెప్పుకోవలసిన విషయం డా. సునీత జగన్ రెడ్డికి సొంత బాబాయి కుమార్తె, తన చెల్లి షర్మిలతో కలిసి పెరిగినావిడ. అవినాష్ రెడ్డి తన తాత సవతి సోదరుని మనుమడు. దూరపు బందువు అనే విషయం పక్కనపెడితే అవినాష్ రెడ్డి కేవలం 22 మంది యంపిలలో ఒకడు మాత్రమే. అతని మీద వస్తున్న బలమైన ఆరోపణలు, దాని చుట్టూ ప్రజల్లో జరుగుతున్న చర్చ, దాని ద్వారా వైసిపి పార్టీకి, జగన్ రెడ్డికి రాజకీయంగా జరుగుతున్న అంతులేని నష్టాన్ని భరిస్తూ కూడా ఎందుకు ఎటువంటి చర్య తీసుకోవడం లేదనేది అంతుబట్టని రహస్యం. వైసిపికే చెందిన యంయల్సీ అనంతబాబు తన కార్ డ్రైవర్ ని హత్య చేసిన కేసులో కనీసం కంటి తుడుపుగానైనా సస్పెండ్ చేసిన వారు, వివేకానంద రెడ్డి కేసు జాతీయ స్ధాయిలో సంచలనం సృష్టించి, ఏకంగా పార్టీ నాయకత్వం మీదే అనుమానాలు రేపుతున్నా అవినాష్ రెడ్డిని సస్పెండ్ చెయ్యటం అటుంచి అసెంబ్లీ మెుదలు అన్ని వేదికలపై సమర్ధించడం ఎందుకనేది ఒక చిదంబర రహస్యం. రాజకీయంగా ఒకపక్క ఇంత జరుగుతుంటే మరోపక్క అటువంటి దూరపు బందువైన అవినాష్ రెడ్డి కోసం తనతో కలిసి, సొంత చెల్లిలా పెరిగిన సునీత రెడ్డికి ఇంత కష్టం కలిగించడం ఊహకి అందని విషయం. కానీ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అవినాష్ రెడ్డి జగన్ కు దూరపు బందువైనా, ఆయన భార్య భారతీ రెడ్డికి స్వయానా మేనమామ కొడుకు, మేనభావ అవుతాడు. ఎక్కడైనా భార్య తరపు బంధువులకు సహజంగానే ఎక్కువ ఆదరణ దొరుకుతుంది గానీ మరీ సొంత బాబాయిని చంపిన కేసులో ముద్దాయిగా ఉన్నా కూడా వెనకేసుకుని వచ్చి సొంత బాబాయి కూతురిని రొడ్డున పడేయటంపై ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి.

ఈ మెుత్తం ఎపిసోడ్ లో జగన్ రెడ్డి స్వంత చెల్లి షర్మిలా రెడ్డి మాత్రం సునీత గారికి మద్దతుగా సిబిఐ వాగ్ములం ఇచ్చారని పలు వార్తలు వచ్చాయి. అవిడ కూడా పలుమార్లు మీడియాల్లో సునీత గారికి అనుకూలంగా మాట్లాడారు. ఏదేమైనా “అమ్మకి అన్నం పెట్టలేనివాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తానన్నాడంట” అన్న మాదిరిగా దగ్గరి బంధువైన చెల్లిని వదిలి దూరపు బంధువైన తమ్ముడిని మెూయవలసి రావడం రాజకీయంగా ఇబ్బందికర పరిణామమే.

కొసమెరుపు ఏమిటంటే, ఈయన తమ్ముడి కోసం ఢిల్లీ యాత్ర చేసినప్పుడే కాకతాళీయంగా పోలవరం, ప్రత్యేకహోదాపై కేంద్రం రాష్ట్రానికి నష్టం కలిగే విదంగా ప్రకటనలు చెయ్యడం.

– శ్రీ కాంత్

ADVERTISEMENT
Latest Stories