జగన్ గారు విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యువతికి చాల విలువైన సందేశమే అందించారు.పెళ్లిళ్లు, పెళ్ళాలు, రాజకీయ నాయకులకు ఉండాల్సిన విలువలు,విశ్వసనీయత, ఆదర్శాలు అంటూ చాల బరువైన పదాలనే వాడారు. ఆయన చేసిన ఘాటైన ప్రసంగానికి రాష్ట్ర వ్యాప్తంగా ఘాటైన చర్చలే జరుగుతున్నాయి.
* తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చి నాయకుడిగా నిలబెట్టిన పార్టీని, పార్టీ అధినేతను, ఆయన కుమారుడిని నోటికొచ్చిన బూతులన్నీ తిట్టే కొడాలి నాని గారిని యువత ఆదర్శంగా తీసుకోవాలా..?
* రాజకీయ విమర్శలు చేయడానికి ఉండే హద్దులను కూడా చెరిపేసి, ఆడవాళ్ళం ఇటువంటి నీచమైన భాషా మాట్లాడకూడదు అనే కనీస సృహ కూడా లేకుండా ఇతరులను రెచ్చగొట్టే విమర్శలు చేసే మంత్రి రోజా గారిని యువత ఆదర్శంగా తీసుకోవాలా..?
* తన రాజకీయ పదవులకు అడ్డువస్తున్నారనే నెపంతో సొంత కుటుంబసభ్యులను కూడా హతమార్చాడు అంటూ ఆరోపణలు ఎదుర్కుంటున్న అవినాష్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలా..?
* తనకున్న అధికార అండతో తన కింద పనిచేస్తున్న ఉద్యోగిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబుని యువత ఆదర్శంగా తీసుకోవాలా..?
* మహిళతో అర్ద నగ్న ప్రదర్శనలు చేసి సామజిక మాధ్యమాలలో అడ్డంగా దొరికిపోయిన ఎంపీ గోరంట్ల మాధవ్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలా..?
* కులాలకు, మతాలకు అతీతంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి పదవి మన క్రైస్తవుడికే దక్కాలి అంటూ మతాలను రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్న ద్వారం పూడిని యువత ఆదర్శంగా తీసుకోవాలా..?
ఐటీ మంత్రి అయ్యుండి కోడు గుడ్డు మీద ఈకలు పీకుతున్న మంత్రి గుడివాడ అమర్నాధ్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలా..?
* జల వనరుల శాఖ మంత్రిగా ఉంటూ ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో చెప్పలేను కానీ గంటకో సినిమా రివ్యూ మాత్రం ఇవ్వగలను అంటూ మాట్లాడే అంబటిని యువత ఆదర్శంగా తీసుకోవాలా..?
* అధినేత మెప్పు కోసం రాజకీయాలతో సంబంధం లేని ఆడవారి పై సమాజం సిగ్గుతో తలదించుకునే విమర్శలు చేసిన వల్లభనేని వంశీ నా యువత ఆదర్శంగా తీసుకోవాల్సింది..?
* ఆడవారి పై అసభ్యకర సినిమాలు తీస్తూ, పొద్దున్న లేస్తే చేతిలో పెగ్గయినా ఉండాలి పక్కన అమ్మాయైనా ఉండాలి అంటూ గర్వంగా చెప్పుకునే “వైసీపీ దర్శకరత్న” రాంగోపాల్ వర్మను యువత ఆదర్శంగా తీసుకోవాలా..?
* ఉన్నత చదువులు చదివి దానిని సమాజ శ్రేయస్సు కోసం కాకుండా అక్రమ సంపాదన కోసం వాడుకుని అరెస్టయ్యి A2 గా పేరు గడించిన విజయ సాయి రెడ్డిని యువతి ఆదర్శంగా తీసుకోవాలా..? ఇలా చెప్పుకుంటూ పొతే బోరుగడ్డ..ఎర్రగడ్డ..అంటూ వైసీపీ నాయకుల లిస్ట్ చాంతాడంత ఉంటుంది.
* ఇటువంటి నేతలందరినీ దగ్గరుండి పదవులిచ్చి మరి ప్రోత్సహిస్తూ తన రాజకీయ అవసరాలకు వాడుకుంటున్న నాయకులనా యువత ఆదర్శంగా తీసుకోవాలి.లేకపోతే తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు వెనకేసుకొని పిల్లలు, పెళ్ళాలు,పెళ్లిళ్లు అంటూ నిత్య విమర్శలు చేసే నాయకులనా యువత ఆదర్శంగా తీసుకోవాల్సింది..?
తన అధికారం కోసం సొంత కుటుంబ సభ్యులను హతమార్చిన ఆరోపణలు ఎదుర్కుంటున్న నాయకులను వెనకేసుకొస్తున్న “త్యాగాల త్యాగరాజు” నా యువత ఆదర్శంగా తీసుకోవాలి..? అంటూ పవన్ పెళ్లిళ్ల పై జగన్ చేసిన హాట్ కామెంట్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి చర్చ జరుగుతుంది.




