జగన్‌ పట్టువదలని విక్రమార్కుడే… కానీ భేతాళుడు భుజం దిగడు

Jagan's Political Tactics Fail to Divide TDP and Jana Sena

‘పట్టువదలని విక్రమార్కుడు… భేతాళుడు’ కధల్లో విక్రమార్కుడులా జగన్‌ కూడా టీడీపి, జనసేనల మద్య చిచ్చు పెట్టేందుకు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఫలించడం లేదు.

టీడీపి, జనసేనలు కలవకూడదని, కలిస్తే వైసీపీకి ఓటమి తప్పదని జగన్‌ చాలా ఆందోళన చెందేవారు. కానీ చంద్రబాబు నాయుడుని అరెస్ట్‌ చేసి ఆయనే స్వయంగా టీడీపితో జనసేనని కలిపారు.

ADVERTISEMENT

ఆ తర్వాత వాటి మద్య చిచ్చుపెట్టేందుకు, ముద్రగడ వంటివారిని ముందు పెట్టి కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి ఎన్నికలలో జనసేనని దెబ్బ తీయాలని విశ్వప్రయత్నాలు చేశారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అవకాశం చిక్కినప్పుడల్లా వాటి మద్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెపుతున్నా వైసీపీ నేతలకు బుద్ధి రావడం లేదు.

టీడీపి జోలికి వెళ్తే ఎదురుదెబ్బలే ఫలితం ఉండదు. కనుక ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుక్కు రావాలన్నట్లు వైసీపీ నేతలు నేటికీ జనసేన వెంటపడుతూనే ఉన్నారు.

ఇందుకు తాజా ఉదాహారణ మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడిన ఈ మాటలే. ‘సేనతో సేనాని’ సమావేశంలో పవన్‌ కళ్యాణ్‌ కార్యకర్తలను ఉద్దేశ్యించి అందరూ సర్దుకుపోవాలి,” అని అన్నారు.

ఆ ఒక్క ముక్క పట్టుకొని పేర్ని నాని, “నాగబాబుకి రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పి ఎమ్మెల్సీతో సరిపెట్టారు. కానీ నారా లోకేష్‌ కోసం సర్దుకుపోవాలని చెప్పారు. నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ మంత్రి పదవులు తీసుకున్నారు కదా?వద్దని సర్దుకుపోవచ్చు కదా?పార్టీ కార్యకర్తలు ఎల్లప్పుడూ ఏదో ఓ పార్టీ జెండాలు మోస్తూనే ఉండాలా? ఎప్పుడూ కార్యకర్తలు సర్దుకుపోతూనే ఉండాలా? ఎందుకు?” అంటూ పేర్ని నాని ఇంకా అనవసరమైన మాటలు చాలానే మాట్లాడారు.

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలకు పనికి రారని, జనసేన ఓ రాజకీయ పార్టీయే కాదని అదో డ్రామా కంపెనీ అని వైసీపీ నేతలు ఎద్దేవా చేసేవారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ అవన్నీ భరిస్తూ, ధైర్యంగా ఎదుర్కొని జనసేనని 100 స్ట్రైక్ రేటుతో పోటీ చేసిన అన్ని స్థానాలలో గెలిపించుకున్నారంటే అర్ధం ఏమిటి? జగన్‌ వ్యూహాలన్నీ ఫెయిల్ అయ్యాయనే కదా?

ఇదివరకు ఒక్కసారి కూడా అధికారంలో లేని జనసేనకు 2024 ఎన్నికలలో ఎన్ని సీట్లు వచ్చాయి?ఐదేళ్ళు అధికారం వెలగబెట్టిన వైసీపీకి ఎన్ని వచ్చాయి?

ఇప్పుడు జగన్‌ ఎక్కడున్నారు? పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడున్నారు?ఎందువల్ల? ఎవరు కారణం? అని పేర్ని నాని వంటివారికి తెలుసు. కానీ ఆ ముక్క చెప్పే ధైర్యం లేదు.

కనుక జగన్‌ని సంతోషపరిచేందుకు ఇలా నోటికి వచ్చినట్లు ఏదో మాట్లాడుతుంటారు అంతే! కానీ జనసేనని రెచ్చగొట్టేందుకు వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించవు… పవన్‌ కళ్యాణ్‌ మాటలు వింటే అర్ధమవుతోంది కదా?ఇంకా ఈ చవుకబారు ప్రయత్నాలు దేనికి?

ADVERTISEMENT
Latest Stories