మళ్ళీ హీరోగా చేయాలా? వద్దా?

Jagapathi Babu Opens up on Bollywood Not Choosing Him‘లెజెండ్’ సినిమాతో మరో ఇన్నింగ్స్ ను ఆరంభించిన జగపతిబాబుకు ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి పాత్రలనైనా అవలీలగా పోషించగల సమర్ధుడు కావడంతో… విలక్షణమైన పాత్రలన్నీ ఈ బాబు సొంతమవుతున్నాయి. అందులో భాగంగానే ఇటీవల తన వద్దకు వచ్చిన “పటేల్ సర్” సినిమాను ఒప్పుకున్నానని, అయితే ఈ సినిమా ఫ్లాప్ అయిన మాట వాస్తవమేనని అంగీకరించారు.

తాము ఇచ్చిన ప్రమోషన్స్ “హార్రర్ థ్రిల్లర్ మాదిరి ఉన్నాయని, కానీ సినిమాలో కుటుంబ కధ చూపించడంతో ప్రేక్షకులు నిరాశ చెందారని, ఈ సినిమా ఫ్లాప్ లో నూటికి నూరు శాతం మాదే తప్పుందని, బిర్యానీ ఆశించి వచ్చిన ప్రేక్షకులకు మామూలు భోజనం పెట్టడం వలనే పరాజయం పాలయిందని” ఒప్పుకున్నారు. అయితే ఇక ముందు హీరోగా చేయాలా? వద్దా? అనేది తనకు వచ్చే కధలను బట్టి ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసారు.

ADVERTISEMENT

జగపతిబాబు నటించిన తాజా చిత్రం “జయ జానకి నాయక” సినిమా విడుదల నేపధ్యంలో ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సదరు సంగతులను చెప్పుకొచ్చారు. లీడ్ రోల్స్ కాకపోయినా… జగపతి ఖాతాలో ‘ఆక్సిజన్, రుధిరం, రంగస్థలం, జగత్ జెంత్రి’ తదితర సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని టాప్ హీరోల సినిమాలు, ప్రస్తుతం చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories