నా కోసమైతే “నాన్నకు ప్రేమతో” సినిమా చూడవద్దు!

Jagapathi babu speech nanaku prematho audio launchసుకుమార్ దర్శకత్వ ప్రతిభలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “నాన్నకు ప్రేమతో” ఆడియో అంగరంగ వైభవంగా జరుగుతోంది. జూనియర్ కెరీర్ లో 25వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకతను సంతరించుకోవడంతో ఊప్పొంగిన అభిమాన తరంగం ఈ ఆడియో వేడుకకు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా “నాన్నకు ప్రేమతో” సినిమాలో కీలక పాత్ర పోషించిన జగపతిబాబు పలు కీలక వ్యాఖ్యలు చేసారు.

“నా కోసమైతే ఈ సినిమా చూడవద్దు, తారక్ కోసమే చూడండి. నన్ను బాగా ఇష్టపడే వారు ఈ సినిమా చూస్తే బాగా తిట్టుకుంటారు. డబ్బులు లేకపోతే మేం ఇస్తాం కదా అని తిడతారు కూడా… ఈ సినిమా స్టోరీ మొత్తం విన్నాకా ఇంత చెడ్డ క్యారెక్టర్ నేను చేస్తున్నానా అని ఒక్కసారి ఆలోచించి, మరుసటి రోజు నుండి యాక్ట్ చేయడం ప్రారంభించానని, ఇటీవల కాలంలో నేను నటించిన సినిమా ఇదని, సుకుమార్ ఇంటెలిజెన్స్ కన్నా కమర్షియల్ గా బాగా తీసారని” జగపతిబాబు చేసిన వ్యాఖ్యలకు అభిమానులు అభివాదాలు పలికారు.

ADVERTISEMENT

మొత్తమ్మీద “నాన్నకు ప్రేమతో” సినిమాలో యంగ్ టైగర్ ఇరగదీసేసాడని, సుకుమార్ మరోసారి సత్తా చాటాడన్న నమ్మకాన్ని అభిమానులకు కలిగించారు. అశేష జనసందోహం నడుమ “నాన్నకు ప్రేమతో” ఆడియో వేడుక కన్నుల పండుగా జరుగుతోంది.

ADVERTISEMENT
Latest Stories