పవన్ టూర్‌‌లో ఫ్యాన్స్ జై జగన్ అంటూ నినాదాలు…

jai jagan slogans in janasena pawan kalyan tourఎవరు అవునన్నా…కాదన్నా…సినిమా హీరోలకు అన్ని పార్టీలలో అభిమానులు ఉంటారు. అధికార వైసీపీ అందుకు మినహాయింపు కాదు. ఆ పార్టీలో ఎన్టీఆర్‌ అభిమానులున్నారు…చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తమ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నంత మాత్రన్న వారు ఆయన సినిమాలు చూడటం మానేయరు. మానేస్తే అదేదో మోటు సామెత చెప్పుకోవలసి వస్తుంది.

తమ అభిమాన హీరో సినిమానే చూడకుండా ఉండలేనివారు అతనే స్వయంగా తమ గ్రామానికి వస్తే వెళ్ళి పలకరించకుండా ఉంటారా? ఇవాళ్ళ పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు అదే జరిగింది.

ADVERTISEMENT

ఆయన బాపులపాడు మండలంలోని హనుమాన్ జంక్షన్ మీదుగా వేలేరు అడ్డురోడ్డు వైపు వచ్చినప్పుడు వైసీపీలోని ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారు పవన్ కళ్యాణ్‌ను చూసి ‘జై జగన్…’ అంటూ నినాదాలు చేస్తూనే చేతులు ఊపుతుండటంతో పవన్ కళ్యాణ్‌ కూడా చిర్నవ్వుతో వారికి నమస్కరిస్తూ తన కారు దగ్గరికి వచ్చినవారికి షేక్‌ హ్యాండ్ ఇస్తూ ముందుకు సాగారు. అయితే ‘ఆత్మసాక్షి’ ఒప్పుకోదు కదా ‘ఏలూరు పర్యటనలో పవన్ కళ్యాణ్‌కు వింత అనుభవం’ అంటూ వేరేలా చెప్పింది.

ADVERTISEMENT
Latest Stories