మోత మోగిన ‘జై లవకుశ’ రైట్స్!

Jai Lava Kusa Teaser Talk Tarak Gives Fans Courageఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ‘జై లవకుశ’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా యూఎస్ హక్కులను సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నట్టు సమాచారం. తన స్నేహితులతో కలిసి యూఎస్ హక్కుల కోసం 10.5 కోట్లకు కోట్ చేయడంతో, ఆయనకే ఖరారు చేయాలని కళ్యాణ్ రామ్ నిర్ణయించుకున్నట్టు ట్రేడ్ టాక్.

‘స్పైడర్’ తెలుగు .. తమిళ యూఎస్ హక్కులు 15.5 కోట్లకు అమ్ముడై ట్రేడ్ పండితులకు అవాక్కు చేయగా, తాజాగా ‘జై లవకుశ’ యూఎస్ హక్కులు ఒక్క తెలుగు భాషకు సంబంధించే 10.5 కోట్లు పలకడం విశేషమేనని చెప్పాలి. అందులోనూ మహేష్ తో పోలిస్తే ఎన్టీఆర్ కు ఓవర్సీస్ మార్కెట్ తక్కువ. అయితే ఈ హక్కులను దక్కించుకున్న నాగవంశీయే .. ఎన్టీఆర్ తదుపరి సినిమాకి నిర్మాత కావడంతో రైట్స్ ఆ మొత్తం పలికిందని తెలుస్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories