నందమూరి నటసింహం నయా ట్రెండ్!

Jai-Simha-Trailerఫస్ట్ గ్లిమ్స్…. టీజర్… ధియేటిరికల్ ట్రైలర్… ఇప్పటివరకు ప్రమోషన్ లో భాగంగా చిత్ర నిర్మాణ సంస్థలు విడుదల చేసాయి. తాజాగా “జై సింహా”తో మరో ట్రైలర్ “ప్రీ రిలీజ్” పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నయా ట్రెండ్ కు నందమూరి నటసింహం శ్రీకారం చుట్టారు. సాధారణంగా ధియేటిరికల్ ట్రైలర్ ను ఒక్కసారే విడుదల చేస్తారు. కానీ “జై సింహా”కు పేరు మార్పుతో రెండు సార్లు విడుదల చేసారు. ఇంతకీ రెండు సార్లు విడుదల చేసినా, ప్రయోజనం ఏమైనా ఉందా? అంటే అది ప్రశ్నార్ధకమే.

ADVERTISEMENT

అవే మూస డైలాగ్స్… అదే రొటీన్ బాడీ లాంగ్వేజ్… బహుశా బాలయ్య అభిమానులను కూడా ఖుషీ చేస్తుందో లేదో గానీ, సాధారణ ప్రేక్షకుల మెప్పు పొందడం మాత్రం కష్టమనే చెప్పొచ్చు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్య లక్కీ హీరోయిన్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ గా హరిప్రియ కనిపించనుండగా, ఈ సంక్రాంతి మాస్ మూవీగా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ప్రీ రిలీజ్ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి..!

ADVERTISEMENT
Latest Stories