జనసేనలో ఎం జరుగుతుంది…

Pawan Kalyan announces Jana Sena changes

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతం కోసం తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి పార్టీ శ్రేణులను పార్టీ క్యాడర్ ని కూడా అయోమయానికి గురి చేస్తుంది. తాజాగా పవన్ ప్రకటించిన ఒక నిర్ణయం కూడా ఇప్పుడు పార్టీ శ్రేణులను ఆలోచనలో పడేసింది.

రాష్ట్ర అధికార ప్రతినిధులను రద్దు చేస్తున్నట్లు పవన్ ప్రకటించడంతో పార్టీ శ్రేణులు గందరగోళంలో పడ్డారు. అసలు పార్టీలో ఎం జరుగుతుంది.? ఈ కొత్త మార్పులకు కారణాలేమిటి.? ఉన్నట్టుండి పవన్ పార్టీ అధికార ప్రతినిధులను ఎందుకు రద్దు చేసినట్టు.?

ADVERTISEMENT

కొత్త కమిటీలు వచ్చే వరకు పార్టీ పేరుతో ఎలాంటి ప్రాతినిధ్యం వహించొద్దని పవన్ ఆదేశించడంతో వెనుకున్న రాజకీయ కారణాలేమిటి అనే చర్చ ఊపందుకుంది. పవన్ తదుపరి ప్రకటన వచ్చే వరకు పార్టీ పరంగా ఎవరు మీడియా డిబేట్లలలో పాల్గొనవద్దు పవన్ ప్రకటించే స్థాయికి జనసేన అధికార ప్రతినిధుల పని తీరు పతనమయిపోయిందా.?

కొత్త ప్రతినిధుల ఎంపిక కు పార్టీ ఎటువంటి దిశా నిర్దేశాలను ప్రకటించనుంది.? కొత్త మార్పులతో పార్టీ రాజకీయంగా మరింత బలపడనుందా.? భవిష్యత్ రాజకీయ అవసరాలను పరిగణలోనికి తీసుకుని పవన్ ఇటువంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారా.?

ADVERTISEMENT
Latest Stories