పవన్ కళ్యాణ్ తీరుపై సర్వత్రా విమర్శలు!

Jana Sena President Absent For Silent Protest Vizagట్విట్టర్ వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్, రిపబ్లిక్ డే సందర్భంగా విశాఖ విచ్చేస్తారని జనసేన కార్యకర్తలు, అభిమాన వర్గం భావించింది. కానీ, అందరికీ ట్విస్ట్ ఇస్తూ… పవన్ యధావిధిగా ‘కాటమరాయుడు’ షూటింగ్ చేసుకుంటూ, మధ్యమధ్యలో ట్వీట్స్ చేస్తూ సందడి చేసారు. ఇప్పటివరకు రాష్ట్ర సర్కార్ పై విమర్శలు చేయాలా వద్దా? అన్న మీమాంసలో ఉన్న పవన్, ఇక నుండి చంద్రబాబు సర్కార్ ను కూడా టార్గెట్ చేయబోతున్నానన్న సంకేతాలు ఇచ్చారు.

అయితే పవన్ విశాఖలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని భావించిన వారంతా ప్రస్తుతం విమర్శలు చేసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా పవన్ ను ఆకాశానికేత్తేస్తూ ట్వీట్లు చేసిన అదే రామ్ గోపాల్ వర్మ, కార్యక్రమానికి దూరంగా ఉండి పవన్ ఫెయిల్ అయ్యాడంటూ తేల్చేసారు. రాజు లేకుండా యుద్ధంలో విజయం సాధించలేరని, పవన్ దూరంగా ఉన్నందుకు చాలా నిరుత్సాహం చెందానని, ఈ రోజు ఫ్లాప్ షో ఇచ్చిన పవన్, రేపటి ప్రెస్ మీటింగ్ లో సూపర్ హిట్ షో ఇస్తాడని నమ్ముతున్నానంటూ తాజాగా ట్వీట్స్ చేసారు.

ADVERTISEMENT

అయితే ఒక రకంగా పవన్ రాకపోవడమే ప్రభుత్వానికి మంచి అయ్యింది. ఒక్క జగన్ తీరుతోనే ఇబ్బందులు పడుతున్న అధికారులు, ఒకవేళ పవన్ కూడా విచ్చేస్తే పోలీసులకు తలకు మించిన భారంగా మారేదని చెప్పడంలో సందేహం లేదు. ఇదెలా ఉన్నప్పటికీ, నిలకడ లేని తీరు పవన్ లో మరోసారి హైలైట్ అయ్యింది. గతంలో కూడా ఒక బహిరంగ సభలో అద్భుతంగా మాట్లాడితే, మరొక సభలో పూర్తిగా తేలిపోయే విధంగా మాట్లాడి కార్యకర్తలను, అభిమానులను నిరుత్సాహపరిచే వారన్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories