జనసేన ఫ్యాన్స్ కదా… అలాగే ఉంటారు..!

JanaSena Fan Momentసోషల్ మీడియాలో జనసైనికులు ఓ ఫోటోను షేర్ చేసుకుంటూ పండగ చేసుకుంటున్నారు. అభిమానం వెర్రితలలు వేస్తె ఎలా ఉంటుందో అన్న దానికి నిదర్శనంగా ఈ ఫోటో నిలుస్తోంది. ఓ పిల్లోడికి జనసేన సింబల్ ను తల మీద కటింగ్ వేయించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. జనసైనికులేమో ఈ ఫోటోను కీర్తిస్తూ షేర్ చేసుకుంటుండగా, నెటిజన్లు, తెలుగు తమ్ముళ్ళు మాత్రం జనసేన అభిమానుల ఆలోచనలను ఈ ఫోటో ప్రతిబింబిస్తుందని విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ADVERTISEMENT

అభిమానం ఉంటే చాటుకోవడానికి చాలా విధాలు ఉన్నాయి గానీ, ఇలా పసి వయసులో ఉన్న పిల్లోడి ద్వారా చాటుకోవడం మాత్రం విమర్శలకు దారి తీస్తోంది. ఎవరి సంతానం వారి వ్యక్తిగతం అయితే కావచ్చు గానీ, అభిమానం పేరుతో ఇలా పైత్యాన్ని ప్రదర్శించడం మాత్రం ఏ పార్టీ వర్గాలకైనా ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. అయినా జనసేన అభిమానుల మాదిరి ఇతర రాజకీయ పార్టీ కార్యకర్తలు ఇలాంటి వికృత చేష్టలను ప్రదర్శించరన్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories