pawan-kalyan-blade-attack

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సంచలన విషయం బయటపెట్టారు. సోమవారం పిఠాపురంలో తన అభిమానులతో మాట్లాడుతూ, “మీ అందరికీ నాతో ఫోటో దిగాలని ఉందని నాకు తెలుసు. నేను కూడా ప్రతీ నియోజకవర్గంలో ప్రతీ అభిమానితో ఫోటో దిగాలనే ఉంది. కనుక రోజుకి 200 మందితో ఫోటోలు దిగుతున్నాను. అయితే ఈ సందడిలో అభిమానుల ముసుగులో ‘బ్లేడ్ బ్యాచ్’ నన్ను, నా సిబ్బందిని బ్లేడ్లతో చిన్నగా గాయపరుస్తున్నారు. కనుక పార్టీలో అభ్యర్ధులతో సహా అందరూ ఈ ‘బ్లేడ్ బ్యాచ్’ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను,” అని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

Also Read – వైసీపీ తెగేదాకా లాగుతుందా.?

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఇంత నీచ స్థాయికి దిగజారిపోతాయని బహుశః ఎవరూ ఊహించి ఉండరు. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి జరిగితే దాని వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని జగన్‌ తరపు న్యాయవాది వాదించారు.

మరిప్పుడు, ప్రతిపక్ష పార్టీ నేత పవన్‌ కళ్యాణ్‌కు జరుగుతున్నపై జరుగుతున్న ఈ బ్లేడ్ బ్యాచ్ దాడులు కూడా అటువంటిదే కదా?ఆ బ్లేడ్ బ్యాచ్ వెనుక ఎవరున్నారు?అసలు ఈ ఐడియా ఎవరిది?

Also Read – నాగార్జున కేసు మూడు రోజులలో… మరి జగన్‌ కేసులో?

గత ఎన్నికల సమయంలోనే వివేకానంద రెడ్డి అతిదారుణంగా హత్య చేయబడ్డారు. పవన్‌ కళ్యాణ్‌ బయటపెట్టిన ఈ ‘బ్లేడ్ బ్యాచ్’ గురించి విన్నప్పుడు ఈసారి ఎన్నికలలో అటువంటిదేదో జరిగే సూచన కనిపిస్తోంది.

రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు, అభ్యర్ధులపై ఇటువంటి భౌతిక దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. అందుకే టిడిపి యువనేత నారా లోకేష్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది కూడా. దానినో హెచ్చరికగా గుర్తించకుండా ఇలాగే చెలరేగిపోతే, ఇప్పుడు కాకపోయినా ఎన్నికల తర్వాత అయినా ఇంతకు ఇంత మూల్యం చెల్లించక తప్పదు.

Also Read – మేమూ డైరీలు రాసుకుంటున్నామోచ్!

చివరిగా అందరికీ కలిగే ధర్మసందేహం: ఎన్నికల సమయంలో ఓ ప్రతిపక్ష పార్టీ అధినేతపై ఈవిదంగా భౌతికదాడులు జరుగుతుంటే, రాష్ట్రంలో పోలీసులు, ఎన్నికల సంఘం ఏమి చేస్తున్నాయి?




ఈ ప్రశ్నకు ఇప్పుడు జవాబు లభించకపోవచ్చు. కానీ ఇటువంటి నీచమైన పనులను ప్రజలు గమిస్తూనే ఉన్నారు. కనుక ఇటువంటి పనులు చేయిస్తున్నవారిని ఎన్నికలలో వారే బుద్ధి చెపుతారు.