ఇది మరి అతి అభిమానమేమో తారక్..?

Janatha Garage, NTR Janatha Garage Ganesh, NTR Janatha Garage Ganesh Idol, NTR Janatha Garage Ganesh Statue,  Janatha Garage NTR Ganesh Idol, Janatha Garage Jr NTR Ganesh Idolయంగ్ టైగర్ అభిమానులంతా ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ అందించిన ఊపులో ఉన్నారు. బాక్సాఫీస్ రికార్డులను రిపేర్ చేస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఫ్యాన్స్ ను అమితంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇంతకు ముందు ఎపుడూ లేనంతగా సింపుల్ చెక్స్ షర్టుతో జూనియర్ ఎన్టీఆర్ సరికొత్తగా కనిపించారు. ఇపుడు ఇదే లుక్ తో ఏకంగా వినాయకుడినే తయారు చేసేసారు జూనియర్ అభిమానులు.

దీంతో ‘జనతా గ్యారేజ్’లో ఎన్టీఆర్ లుక్ తో ‘వినాయక ప్రతిమ’ను ప్రతిష్టించి పూజలు చేయడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. నిజానికి ఇలాంటి విగ్రహాలు ‘జనతా గ్యారేజ్’తోనే మొదలు కాదు. అంతకు ముందు ‘గబ్బర్ సింగ్, రోబో, బాహుబలి, శ్రీమంతుడు’ వంటి చాలా సినిమాలకు ఇలా తమ తమ హీరోలను వినాయకుని ఆకారంలో ప్రతిష్టించి పూజలు చేసిన సందర్భాలున్నాయి.

ADVERTISEMENT

అయితే ఈ ఏడాది ఆ సందడి కాస్త తగ్గింది. ఈ ఏడాది సమ్మర్లో వచ్చిన పెద్ద హీరోల చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలు కావడంతో, వినాయకుని అవతారాలు కేవలం ‘జనతా గ్యారేజ్’లోని జూనియర్ ఎన్టీఆర్ వరకు మాత్రమే పరిమితమయ్యాయి. ‘అభిమానం పైత్యం రూపంలో మారితేనే ఇలా అతి ప్రేమను చూపిస్తూ దేవుని విగ్రహాలను తమ హీరోల రూపంలో తయారుచేస్తారు’ అంటూ సర్వత్రా వ్యక్తమవుతున్న విమర్శలు కోకొల్లలు.

ADVERTISEMENT
Latest Stories