ట్రైలర్ టాక్ – రొటీన్… కానీ డైలాగ్స్ గుడ్..!

Jawaan Trailer Talkసాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా దిల్ రాజు సమర్పణలో ‘జవాన్’ చిత్రం తెరకెక్కింది. మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా, వచ్చేనెల 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్, ఆసక్తిని రేకెత్తించేలా వుంది.

ADVERTISEMENT

“యుద్ధం మొదలయ్యాక పక్కోడు పోయాడా .. వెనకోడు ఆగిపోయాడా .. ముందోడు కూలిపోయాడా కాదురా .. యుద్ధం గెలిచామా? లేదా? అన్నదే ముఖ్యం” అంటూ విలన్ తో సాయిధరమ్ తేజ్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. దేశ ద్రోహుల కార్యకలాపాలకు అడ్డుగా నిలుస్తూ .. వాళ్ల బారి నుంచి ఒక వైపున తన కుటుంబాన్ని .. మరో వైపున తన దేశాన్ని కాపాడుకునే యువకుడిగా ఈ ట్రైలర్ లో సాయిధరమ్ తేజ్ కనిపిస్తున్నాడు.

మొత్తం మీద ఈ ట్రైలర్… సినిమాపై ఆసక్తిని కలిగించేలా ట్రైలర్ ఉందని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories