తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తమిళనాడు రాజకీయాలను చాలా ప్రభావితం చేసింది. జయలలితకు ప్రజల్లో ఉన్న ఆదరణ మేరకు అనేక సినిమాలు రూపొందుతున్నాయి. తలైవి అనే పేరుతో కంగనా రనౌత్ ఒక సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఒక సినిమా చేస్తుంది. ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ మధ్యనే విడుదలైంది.
అయితే ఆ లుక్ చాలా ఎబ్బెట్టుగా ఉంది. అసలు కంగనా జయలలితగా నప్పలేదని, మేక్ అప్ కుదరలేదని చాలా మంది అన్నారు. మరోవైపు జయలలిత జీవితం ఆధారంగా గౌతమ్ మీనన్ ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాడు. దాంట్లో రమ్యకృష్ణ జయలలిత పాత్రలో నటిస్తుంది. ఆ ఫస్ట్ లుక్ కాసేపటి క్రితం విడుదలైంది.
కంగానా లుక్ కంటే రమ్యకృష్ణ లుక్ అదిరిపోయింది. రేపు దానికి సంబంధించిన ట్రైలర్ విడుదల అవుతుంది. పదుల కోట్లు పెట్టి తీస్తున్న సినిమా కంటే వెబ్ సిరీస్ అవుట్ ఫుట్ బెటర్ గా ఉండటం విశేషం. రేపు ట్రైలర్ రెస్పాన్స్ కూడా బావుంటే కంగనా సినిమాకు ఇబ్బందే అని చెప్పుకోవాలి.
సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన మహానటి సినిమా అపూర్వ విజయంతో జీవిత చరిత్ర సినిమాలపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో ఈ సినిమా బృందాలు ఆ రేంజ్ ని అందుకోవడానికి చాలానే కష్టపడాలి. చూడాలి వీరు చివరికి ఏం చెయ్యబోతున్నారు అనేది.



