పబ్లిక్ లోకి వస్తే కురచ కాస్ట్యూమ్స్ కష్టం!

Jhanvi-Kapoor-Viralశ్రీదేవి తనయురాలిగా జాన్వీ కపూర్ ఇప్పటికే కావలసినంత పబ్లిసిటీ పొందారు. దీనికి తోడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ ఫోటోలు, వీడియోలతో నెటిజన్లకు బాగా సుపరిచితం అయ్యారు. దీంతో బయట ఎక్కడ కనపడినా జాన్వీని అందరూ గుర్తుపట్టే పరిస్థితి నెలకొంది. అందుకే నటించిన మొదటి సినిమా ‘దడక్’ విడుదల కాకముందే తనకున్న క్రేజ్ ఏమిటో తాజాగా తెలిసి వచ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ముంబై బాంద్రా ఏరియాలోని ఓ రెస్టారెంట్ కు వెళ్లి బయటకు వస్తుండగా, స్థానికంగా ఉన్న చిన్న పిల్లలు, యువతరం ఆమెను చూడడానికి ఎగబడ్డారు. వారిని చూస్తూ, పలకరిస్తూ చిరునవ్వుతోనే కారు ఎక్కేసింది జాన్వీ. ఈ సమయంలో ఆమె ధరించిన కాస్ట్యూమ్స్ హాట్ టాపిక్ అయ్యాయి. మరీ కురచ దుస్తులు ధరించి పబ్లిక్ లోకి రావడం ప్రస్తుతానికి చెల్లుబాటు అయ్యిందేమో గానీ, భవిష్యత్తులో ఇవి ఇబ్బందికరంగా మారతాయన్న విషయాన్ని జాన్వీ గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories