ఇప్పుడు కదా… కింగ్ సంతోషపడేది..!

premam-naga-chaitanyaఅన్నమయ్య, శ్రీరామదాసు వంటి ఆల్ టైం క్లాసిక్స్ గా నిలిచిపోయే చిత్రాలను తెరకెక్కించడం వెనుక రాఘవేంద్రరావు కష్టం ఎంతుందో.., కథను అందించేందుకు జేకే భారవీ కూడా అంతే కష్టపడ్డారు. అంతటి గొప్ప కథా రచయిత, నాగచైతన్యను ప్రశంసిస్తూ… నాగార్జునకు ఓ లేఖ రాయగా, దాన్ని చదివి పుత్రోత్సాహం పట్టలేక, తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. భారవి రాసిన ఆ లేఖలో…
నమస్తే నాగ్‌ గారు.,
ప్రేమమ్‌ చూశాను
చైతు చాలా బాగా తన వంతు పాత్ర పోషించాడు
ఇప్పటివరకూ తను చేసిన అన్ని ఫిల్మ్స్ కన్నా ప్రేమమ్‌ లో అత్యద్భుతమైన పరిణతితో కూడిన నటనను గమనించారు. పరిపూర్ణ నటుడిగా ఈ ఫిల్మ్ తో ప్రూవ్ చేసుకున్నాడు. తాతగారి పక్కన… మీ పక్కన నిలబడే యోగ్యతను సంపాదించుకున్నాడు.

ADVERTISEMENT

చేయించుకునే వాడుంటే… ఎంతైనా చేయగలను… అని ఏఎన్‌ఆర్‌ చాటాడు. ఆ మహానటుడి వారసుడు మీరు, మీ వారసుడు చైతూ. ఈ లిస్ట్ లోకి అఖిల్‌ కూడా చేరాలని ఆశిస్తున్నాను.

మీ పుత్రోత్సాహానికి జయహో…
జేకే భారవి
అని లేఖ రాయగా, దాన్ని నాగ్ పంచుకున్నాడు.

ADVERTISEMENT
Latest Stories