‘శ్రీమంతుడు’ ఫార్ములాతోనే ‘జనతా గ్యారేజ్’

Jr NTR Fans‘శ్రీమంతుడు’ సినిమా విడుదలకు ముందు ఒక అంశాన్ని నిశితంగా పరిశీలిస్తే… ఎప్పుడూ లేనంతగా ప్రిన్స్ మహేష్ బాబు తన అభిమానులతో షూటింగ్ స్పాట్ లో ఫోటోలు దిగారు. అవన్నీ సోషల్ మీడియాలో సందడి చేయడం, తద్వారా ‘శ్రీమంతుడు’ సినిమాకు పబ్లిసిటీ… ఇలా స్వామికార్యం, సకార్యం రెండూ పూర్తయ్యాయి. అలాగే ఆ సినిమా విడుదలై, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ను అందుకోవడం అన్నీ జరిగిపోయాయి.

ADVERTISEMENT

సీన్ కట్ చేసి… ప్రస్తుతం సెట్స్ పైనున్న ‘జనతా గ్యారేజ్’ సినిమాకు వస్తే… గత నెల రోజులుగా అభిమానులతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇటీవల చెన్నైలోనూ తారక్ దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీని ద్వారా అభిమానులను నూతన ఉత్సాహంలో నింపడంతో పాటు ‘జనతా గ్యారేజ్’ సినిమా పబ్లిసిటీ కూడా జరుగుతున్నట్లువుతోంది.

మరి ఈ ఐడియా మైత్రీ మూవీస్ సంస్థలు నిర్వాహకులదో లేక సదరు హీరోలదో గానీ, ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్’ సెట్స్ లలో అభిమాన హీరోలతో దిగిన ఫోటోలు ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. బహుశా మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించబోయే తదుపరి సినిమాతో ఈ స్ట్రాటజీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories