ఒక్క వీడియో తోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను మైమరచిపోయేలా చేసిన రాజమౌళి

Jr NTR Horse Riding RR Movie Shootingఎస్ ఎస్ రాజమౌళి తెలుగు దర్శకులలో ప్లాప్ అంటూ లేని దర్శకుడు. బాహుబలితో దేశం మొత్తం చూపు తన వైపు తిప్పుకున్నాడు. రాజమౌళి సక్సెస్ ఫార్ములా ఏంటంటే ఆయనకు అభిమానులు, ప్రేక్షకులు ఏం కోరుకుంటారో బాగా తెలుసు. అదే ఆయన సినిమాలో ఉండేలా ప్రయత్నిస్తారు. ఆయన తదుపరి చిత్రం ఆర్ఆర్ఆర్ లో కూడా అదే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ చిత్రానికి సంబందించిన ఒక మీడియా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఆ వీడియోలో ఎన్టీఆర్ ఒక గుర్రాన్ని మచ్చిక చేసుకునే పనిలో ఉన్నాడు. దీని బట్టి ఎన్టీఆర్ సినిమాలో గుర్రపు స్వారీ చేస్తాడని అర్ధం అవుతుంది. దీనితో ఎన్టీఆర్ అభిమానులు ఖుషీగా ఉన్నారు. సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది.

ADVERTISEMENT

ఇక ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె పాత్ర కోసం ఇంకా వేట కొనసాగుతుంది. జులై 30, 2020 తారీఖున విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం. బాహుబలి లగే తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషలలో ఒకేరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో విడుదల కాబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం చిత్రంలోని ఇంటర్వెల్ కు సంబంధించిన సీన్ షూట్ చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories