జూనియర్ ఎన్టీఆర్ ఇంట రెండో సంతానంతో ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా సంతోషంలో మునిగిపోయారు. తాజాగా ఆ ఫోటో కూడా బయటకు రావడంతో అభిమానులంతా, సదరు ఫోటోను షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అయితే ఇప్పుడే అంత హైట్ ఉన్నాడేంటి? అంటూ చర్చించుకోవడం నెటిజన్ల వంతవుతోంది. ‘బహుశా తారక్ ను మించిన వాడవుతాడేమో’ అంటూ మురిసిపోవడం ఫ్యాన్స్ వంతవుతోంది.
ఇంతకీ తన రెండో తనయుడికి ఏం పేరును జూనియర్ ఎన్టీఆర్ ఖరారు చేసారు? అనేది ఆసక్తికరంగా మారింది. తొలి సంతానానికి తాత పేరు కలిసి వచ్చేలా ‘రామ్’కు ముందు అభయ్ ను చేర్చిన జూనియర్, మరి ఈ ఈయనకు ఏ ‘రామ్’ను ఖరారు చేస్తాడో? ఫ్యాన్స్ అయితే నందమూరి తారక రామారావు అని పెట్టేయండి చాలు అంటున్నారు. అభయ్ పేరును స్వయంగా తారక్ వెల్లడించడంతో, ప్రస్తుతం ఫ్యాన్స్ అంతా ఎన్టీఆర్ ట్విట్టర్ వైపుకు చూస్తున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT



