చిన్ని రామయ్య బంగారుకొండ

 Jr NTR pays 2 months salary in advance to his employeesకరోనా కారణంగా పేద మధ్య తరగతి వర్గాలు ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. చాలా మంది ఇళ్లకే పరిమితం కావడంతో పనులు లేక తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కొంత మంది తమ వద్ద పని చేసే వారికి, పనికి రాకపోయినా డబ్బులు ఇస్తుంటే.. చాలా మంది అంతటి ఔదార్యం కలిగి ఉండటం లేదు.

అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం తన వద్ద పని చేస్తున్న వారికి ఈ సమయంలో అండగా నిలిచారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎన్టీఆర్‌ తన ఇంట్లో, కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు రెండు నెలల జీతం ముందస్తుగా చెల్లించేశారట. అంతేకాదు ఎప్పుడు ఆర్థిక అవసరం వచ్చినా సాయం చేస్తానని ప్రామిస్ కూడా చేశాడట. ఆయన దగ్గర పనిచేసే వారు, అభిమానులు చిన్ని రామయ్య బంగారుకొండ అంటూ మురిసిపోతున్నారు

ADVERTISEMENT

మరోవైపు… కరోనాతో పోరు కోసం ఎన్టీఆర్ ఇప్పటి వరకు రూ.75 లక్షలు విరాళం అందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు, సినీ కార్మికుల కోసం రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఎప్పుడూ షూటింగ్లతో బిజీగా ఉండే ఎన్టీఆర్ లాక్ డౌన్ వల్ల తన కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతున్నారు.

లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చే అవకాశం లేదని అంటున్నారు….. కొందరైతే ఏకంగా 2021 జులై 30న సినిమా వస్తుందని అంటున్నారు. ఇది నందమూరి, మెగా అభిమానులకు పూర్తిగా నిరాశపరిచి వార్త అనే చెప్పుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories