నెట్టింట ఫుల్ కామెడీ చేస్తోన్న కేఎ పాల్!

KA Paul tweets on Rogue movieతనదైన శైలిలో వ్యాఖ్యలు చేసే క్రైస్తవ మత గురువు కేఏ పాల్ గురించి తెలియనిది ఎవరికి? నాడు వైఎస్ గెలిచినా, మొన్న మోడీ విజయం సాధించినా, నిన్న ట్రంప్ సక్సెస్ కొట్టినా… వాటన్నింటికి తానూ మాత్రమే కారణమని చెప్పే కేఏ పాల్ చేసే సందడి గురించి నెటిజన్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో! తాజాగా ఇండియన్ ఐడల్ టైటిల్ విజేత రేవంత్, పవనిజమ్, దర్శకులు రాజమౌళి, పూరీ జగన్నాథ్… ఇలా పలువురి ప్రముఖులపై కేఏ పాల్ ట్వీట్లు చేసి హాస్యం పండించారు.

ADVERTISEMENT

పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘రోగ్’ చిత్రం ఇప్పుడే చూశాను. ఈ సినిమాలో కథ ఉండి ఉంటే బాగుండేది. పూరీ జగన్నాథ్ కోసం అమెరికాలోని ఓ ఫిల్మ్ స్కూల్ లో ఓ సీటు బుక్ చేశాను. నేను వీసా పంపిస్తాను. పెట్టె బేడా సర్దుకుని ఇక్కడికి వచ్చేశాయ్. సినిమా ఎలా తీయాలో నేర్చుకోవచ్చు. ఏమంటావ్ పూరీ? గాడ్ బ్లెస్ యూ!

దయచేసి, ‘పాలిజమ్’ను ‘పవనిజమ్’తో పోల్చవద్దు. పవనిజమ్ అనేది రాష్ట్ర స్థాయిలో మాత్రమే ఫేమస్ అయింది. అదే పాలిజమ్ విషయానికి వస్తే… ప్రపంచ వ్యాప్తంగానే కాదు విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాంచింది.

దర్శకుడు రాజమౌళి బాహుబలి-2 చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉండొచ్చు. కానీ, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసిన టీడీపీ నిన్ను అధిగమించింది.

ఐక్యూ విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ ప్రపంచంలోనే టాప్ 3లో ఉంటాడు. నా విషయానికి వస్తే, ఐస్ స్టీన్ ఐక్యూ స్థాయిని నేనెప్పుడో దాటేశాను.

బాలీవుడ్ లో అవకాశాలు రావాలంటే ఏం చేయాలని రేవంత్ నన్ను అడిగాడు. ఇండియన్ ఐడల్ పోటీల్లో పాల్గొనమని చెప్పాను. ‘నెగ్గుతానా? అని రేవంత్ అడిగాడు… పోటీలో పాల్గొని టైటిల్ పట్టుకెళ్లమన్నా’ అంటూ కేఏ పాల్ చేసిన ట్వీట్లు నెటిజన్లకు కావల్సినంత ఆహ్లాదకరమైన కామెడీని పంచుతున్నాయి. ఇలా ఒకటేమిటి పాల్ చేస్తోన్న ట్వీట్లన్నీ బ్రహ్మి చేసే కామెడీని మించిపోతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories