టీజర్ టాక్ – అన్నీ వినపడతాయి… ఏమీ చూడలేరు..!

kaabil-trailer-talkవినూత్న ఆలోచనలతో ఆసక్తికరంగా వచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తాయన్నది చాలా కాలంగా నిరూపితమవుతోంది. 2017, జనవరి 26వ తేదీన హృతిక్ రోషన్ ‘కాబిల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘మొహెంజదారో’ ఘోరపరాజయం తరువాత హృతిక్ నటించిన ఈ సినిమాలో యామి గౌతమ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను గతంలోనే విడుదల చేయగా, తాజాగ తొలి టీజర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

“మీ కళ్లు తెరిచే ఉంటాయి… కానీ మీరేమీ చూడలేరు… మీ చెవులు కూడా పని చేస్తాయి… కానీ మీరేమీ వినలేరు. మీ గొంతు తెరిచే ఉంటుంది… కానీ మీరేమీ మాట్లాడలేరు… అంత కంటే గొప్ప విషయం ఏంటంటే… మీకు మొత్తం అర్థమవుతుంది… కానీ భవిష్యత్ లో ఎవరికీ అర్ధమయ్యేలా చెప్పలేరు…” అంటూ హృతిక్ డైలాగ్స్ తో సాగే టీజర్ వినూత్నంగా ఉంది.

ADVERTISEMENT

ఈ టీజర్ లో కేవలం అక్షరాలు, బ్లర్ లో కాంతి వెలుగులు మాత్రమే కనిపిస్తూ హృతిక్ గొంతు వినిపిస్తుండడం ఉత్కంఠకు గురిచేస్తోంది. ‘కాబిల్’ సినిమా కు నిర్మాతగా రాకేష్ రోషన్ వ్యవహరిస్తుండగా, అతని చిన్నాన్న రాజేష్ రోషన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను అక్టోబర్ 26న విడుదల చేయనున్నామని, ఈ టీజర్ ద్వారా స్పష్టత ఇచ్చారు.

ADVERTISEMENT
Latest Stories