‘బాహుబలి’ రికార్డులు బద్దలు కొట్టిన ‘కబాలి’

Kabali Collections, Kabali Premier Collections, Kabali Movie Premier Collections, Rajinikanth Kabali Premier Collections, Kabali First Day Collections,ట్రేడ్ వర్గాలు, సినీ ప్రేక్షకులు, సూపర్ స్టార్ అభిమానులు… అంచనా వేసిన విధంగానే ‘బాహుబలి’ సినిమా రికార్డులను ‘కబాలి’ అధిగమించింది. యుఎస్ బాక్సాఫీస్ వద్ద ప్రీమియర్ షోలతోనే 1.39 మిలియన్ డాలర్స్ వసూలు చేసిన సినిమాగా ‘బాహుబలి’ గతేడాది సరికొత్త చరిత్రను సృష్టించగా, తాజాగా సూపర్ స్టార్ తన ‘కబాలి’తో ఆ రికార్డును తుడిచిపెట్టాడు.

ADVERTISEMENT

తాజా లెక్కల ప్రకారం ‘కబాలి’ ప్రీమియర్ కలెక్షన్స్ 1.45 మిలియన్ డాలర్స్ గా లెక్క తేలగా, ఇంకా లెక్కించాల్సిన షోలు మరికొన్ని ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఒక్క ప్రీమియర్ కలెక్షన్స్ తోనే దాదాపు 1.50 మిలియన్ డాలర్స్ ని అందుకుని సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నాడు ‘కబాలి.’ ప్రీమియర్ షోల ద్వారా ప్రారంభమైన రికార్డుల పరంపర చివరివరకు కొనసాగితే, సూపర్ స్టార్ అభిమానులకు అంతకు మించిన పండగ మరొకటి ఉండదు.

ప్రీమియర్ షోల టాక్ అంత ఆశాజనకంగా లేకపోవడంతో… యుఎస్ వీకెండ్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిపోవడంతో, ఈ వీకెండ్ వరకు ‘కబాలి’కి డోకా లేదన్న అంశాన్ని ట్రేడ్ పండితులు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి గత సంవత్సర కాలంగా ఊరిస్తున్న ‘బాహుబలి’ వసూళ్ళ రికార్డులలో తొలి రికార్డుకు బ్రేక్ పడినట్లయ్యింది.

ADVERTISEMENT
Latest Stories