కబాలి’ టికెట్ల కోసం మంత్రి గారి పిఏ లేఖ!

Kabali Tickets, Minister PA Kabali Tickets, Minister PA Recommendation Kabali Tickets, Minister PA Recommendation Kabali Tickets, Minister PA Recommendation  Letter Kabali Ticketsసూపర్ స్టార్ తాకిడిని తట్టుకోవడం రాజకీయ నేతల వల్ల కూడా కావడం లేదన్న నిజాన్ని ఈ లేఖ చెప్పకనే చెప్తోంది. తమిళనాడు ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ మంత్రి గారి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అయిన ప్రేమ్ కుమార్, ఒక ధియేటర్ యాజమాన్యానికి ‘కబాలి’ టికెట్లు కావాలంటూ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

చెన్నైలోని అభిరామి ధియేటర్లో ‘కబాలి’ సినిమా మొదటి రోజు ఫస్ట్ షోకు గానూ ఓ 10 టికెట్లు ఇవ్వమని మంత్రి గారి స్టాంపుతో కూడిన లెటర్ ప్యాడ్ దర్శనమివ్వడం సూపర్ స్టార్ తాకిడి ఏ రేంజ్ లో ఉందో చాటి చెప్తోంది. అది కూడా సినిమా విడుదలకు ఒక వారం రోజులు ముందుగానే ఈ లెటర్ రాయడం విశేషం. సాధారణ అభిమానులు, రాజకీయ ఉద్దండులు అన్న తారతమ్యం లేకుండా ‘కబాలి’ అందరినీ ఒక ఊపు ఊపుతోంది. మరి చివరికి సూపర్ స్టార్ వెండితెరపై ఎలా చెలరేగుతారో చూడాలి.Kabali Tickets, Minister PA Kabali Tickets, Minister PA Recommendation Kabali Tickets, Minister PA Recommendation Kabali Tickets, Minister PA Recommendation  Letter Kabali Tickets

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories