ఆ హీరోకి అక్కగా మారనున్న కాజల్?

Kajal Aggarwal acting as Manchu Vishnu Sisterమంచు విష్ణు తన తొలి క్రాస్ఓవర్ చిత్రం మోసగాళ్లు షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకున్నాడు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ చిత్రం జూన్ 5 న విడుదల అవుతుందని సమాచారం. మరొక వైపు, ఈ చిత్రం కథ గురించి ఆసక్తికరమైన పుకార్లు ఉన్నాయి.

మోసగాళ్లు కథ 2700 కోట్ల విలువైన అతిపెద్ద ఐటి స్కామ్‌ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది, ఇది భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలను కుదిపేసింది. ఈ కుంభకోణంలో ఇద్దరు అన్నా చెలెళ్ళు పాల్గొన్నారట. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ విష్ణు సోదరిగా కనిపిస్తారని పుకార్లు వస్తున్నాయి. నిజమైతే ఆసక్తికరమే.

ADVERTISEMENT

మరోవైపు, ఈ చిత్రం కోసం కుకట్‌పల్లిలో భారీ కార్పొరేట్ కార్యాలయాన్ని సెట్ గా నిర్మించారు, దీని కోసం 3.5 కోట్లు ఖర్చుపెట్టారట. ఈ నెలలో ఈ సెట్‌లో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది, అయితే ఈ సెట్ ఇప్పుడు ఖాళీగా పడివుంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రాన్ని తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ఒకేసారి రూపొందిస్తున్నారు. తెలుగు వెర్షన్లో పాటలు, ఫైట్లు వంటి మసాలా ఐటమ్స్ ఉంటాయి. మరోవైపు ఇంగ్లీష్ వెర్షన్ విడుదల ఎప్పుడు అనేది ఇంకా కంఫర్మ్ కాలేదు. మొదటిగా ఏదైనా ఫిల్మ్ ఫెస్టివల్ లో సినిమాని ప్రదర్శించాలని విష్ణు అనుకుంటున్నాడట.

ADVERTISEMENT
Latest Stories