కాజల్ లిస్టులో లేని పవన్ కళ్యాణ్!

kajal aggarwal not following pawan kalyan in twitter‘బ్రహ్మోత్సవం’ సినిమాకు సంబంధించిన కూల్ పోస్టర్ తో ట్విట్టర్ లోకి అడుగు పెట్టిన ‘చందమామ’ కాజల్ కు టాలీవుడ్, కోలీవుడ్ సినీ వర్గాలు స్వాగతం పలికాయి. కాజల్ ను ఫాలో అయ్యే వారి సంఖ్య దాదాపుగా 20 వేలు దాటగా, ఓ 20 మందిని కాజల్ ఫాలో అవుతోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలలో టాప్ రేంజ్ లో ఉన్న వారు కాజల్ జాబితాలో ఉన్నారు.

ADVERTISEMENT

తెలుగు సినీ హీరోలలో ప్రిన్స్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రానా, నాగార్జునలు ఉండగా, దర్శకుల జాబితాలో ఎస్ ఎస్ రాజమౌళి ఒక్కరే ఉన్నారు. అయితే టాలీవుడ్ క్రేజీ హీరో, ఇటీవల విడుదలైన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మాత్రం కాజల్ లిస్టులో లేకపోవడం విశేషం. బహుశా పవన్ ట్విట్టర్లో ఉన్నారని కాజల్ కు తెలుసో లేదో గానీ, పవన్ సమకాలీకుడైన ప్రిన్స్ ను ఫాలో అవుతూ పవన్ ను విస్మరించడం పవన్ అభిమానులకు ఆవేదన కలిగించే అంశం.

ఇక, ప్రస్తుతం కాజల్ నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా విడుదలకు ముందు ట్విట్టర్లో అడుగు పెట్టడంతో… ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కాజల్ నెత్తిన పడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉండే సమంతకు కాజల్ కూడా తోడైతే, ‘బ్రహ్మోత్సవం’ సినిమా పబ్లిసిటీ పీక్స్ కు చేరుకుంటుందని నెటిజన్ల భావన.

ADVERTISEMENT
Latest Stories