‘ఖైదీ’ బ్యూటీపై మీడియాలో చక్కర్లు!

Kajal Aggarwal love affair with businessmanటాలీవుడ్ లో దాదాపు దశాబ్ద కాలంగా అగ్ర హీరోయిన్ గా కొనసాగుతూ, మెగాస్టార్ చిరంజీవితో సహా అందరి టాప్ హీరోలతోనూ నటించిన ఏకైక హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నిలిచింది. మరో వైపు కోలీవుడ్ లో కూడా టాప్ హీరోల సరసన నటించి బిజీ హీరోయిన్ గా కొనసాగింది. అలాగే బాలీవుడ్ లో కూడా 100 కోట్ల చిత్రాల క్లబ్ లో కాజల్ హీరోయిన్ గా ఉందన్న విషయం తెలిసిందే. ఇలా మూడు ‘వుడ్’లలోనూ బిజీగా ఉన్న ఈ అమ్మడు గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

అదే ఓ బిజినెస్ మెన్ తో కాజల్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందనేదే ఈ వార్త. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారని ట్రేడ్ టాక్. ఇదే కనుక నిజమైతే… ఇంతకాలం వెండితెరపై తన అందచందాలతో రంజింపజేసిన కాజల్, ఇకపై సినీ అభిమానులకు దూరమైనట్టే. కాజల్ ప్రియుడికి దేశవ్యాప్తంగా చైన్ హోటల్ బిజినెస్ ఉందట. వీరిద్దరూ సమయం దొరికినప్పుడల్లా కలుసుకుంటున్నారట. ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసేసిన తర్వాత పెళ్లి పీటలు ఎక్కాలని కాజల్ భావిస్తోందట.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories