త్రిష, హన్సిక వంటి స్టార్ హీరోయిన్లున్న “కళావతి” సినిమా ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పి.సుందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్ద్ హీరోగా నటిస్తున్నాడు. ఇంతకు ముందు విడుదలై ఘనవిజయం సాధించిన “చంద్రకళ” సినిమాకు సీక్వెల్ గా ఈ “కళావతి” ప్రేక్షకులను భయపెట్టడానికి రాబోతోంది.
విడుదల తేదీ సమీపిస్తుండడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తాజాగా విడుదలైన ధియేటిరికల్ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. తమిళంలో ఇప్పటికే ట్రైలర్ ను విడుదల చేయగా, తాజాగా తెలుగు వర్షన్ ట్రైలర్ ను విడుదల చేసారు.
మునుపటి సినిమా “చంద్రకళ” పోలికలు స్పష్టంగా కనపడుతున్నప్పటికీ, స్టార్ అండ్ హాట్ హీరోయిన్ల భారీ క్యాస్టింగ్ తో సినిమా స్వరూపం మారిపోయింది. రెగ్యులర్ హార్రర్ సినిమాల మాదిరి కనపడుతున్నా, ఇటీవల కాలంలో హార్రర్ సినిమాలకు దక్కుతున్న ఆదరణ రీత్యా “కళావతి”కి కూడా ప్రేక్షకులు పట్టం కడతారని అంచనా వేస్తున్నారు.





