కవిత కేసు వాయిదా..! కేసీఆర్ అసహనం..!

KCR-Kavitha

ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కున్న కేసీఆర్ కుమార్తె బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15 న హైద్రాబాద్ లో అరెస్టు చేసారు ఈడీ అధికారులు. అయితే మార్చి 26 న కవితను తీహార్ జైలు కు తరలించారు. ఈ నేపథ్యంలో ఆమె తనకు బెయిల్ కావాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న ఆమె తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, అందుకు తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ మార్చి 26 న రౌస్ అవెన్యూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసారు.

ADVERTISEMENT

ఈ నేపథ్యంలో కేసు విచారణ చేపట్టిన నాయ్యస్థానం కవిత వేసిన పిటిషన్ ను ఏప్రిల్ 4 కు వాయిదా వేసింది. అలాగే ఇదే లిక్కర్ స్కాం లో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి కెజ్రీవాల్ కూడా తీహార్ జైలుకే చేరుకున్నారు. ప్రస్తుత పరిస్థితులలో కవిత కేసులో కాస్త ఊరట దక్కిన అది బిఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు కొండంత దీపంలా మారుతుందనే నమ్మకంతో ఉన్న పార్టీ శ్రేణులకు, కేసీఆర్ కుటుంబ సభ్యులకు కేసు వాయిదాతో నిరాశే మిగిలిందని చెప్పాలి.

అటు కేంద్రంలో కవిత మీద ఈడీ, ఇటు రాష్ట్రంలో నదీజలాల ప్రోజెక్టుల విషయంలో కేసీఆర్ పైన విమర్శలు, కేటీఆర్ పైన ఫోన్ టాపింగ్ ఆరోపణలతో బిఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇటువంటి కష్టకాలంలో పార్టీకి తనకు అండగా ఉండాల్సిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారడం, ముఖం చాటేయడం కేసీఆర్ సహించలేకపోయారు.

తన అసహనాన్ని ఎలా తెలియచేయాలో అర్ధం కాకా తమ పార్టీ నుండి పక్క పార్టీలకు జంప్ అవుతున్న నాయకులను కుక్కలు, నక్కలు అంటూ సంభోదించి మరోసారి ప్రత్యర్థుల చేతిలో నవ్వులపాలవుతున్నారు కేసీఆర్. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలానే పక్క పార్టీల నేతలను కారెక్కించుకుని ఇప్పుడు కారు దిగుతున్న నేతలను కుక్కలు, నక్కలు అంటూ విమర్శించడం కేసీఆర్ స్థాయికి తగదు అంటూ బీజేపీ నేత రఘునందన్ హెచ్చరిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories