రిక్కీ రాధన్ ఎంట్రీ: కవిత కూడా ‘జననాయకి’ కాగలరా.?

Kalvakuntla Kavitha with Ricky Radhan

తమిళనాడు ఎన్నికలలో విజయ్ టీవీకే విజయం కొత్తగా పార్టీ పెట్టిన, పెట్టాలనుకుంటున్న పొలిటికల్ లీడర్స్ కి ఒక దిక్సూచీలా మారిందనే చెప్పాలి. ఎన్నికలలో పోటీ చేసిన మొదటి ప్రయత్నంలోనే విజయ్ అనూహ్యంగా అధికార పీఠం దక్కించుకోవడంతో అసలు విజయ్ అనుసరించిన పొలిటికల్ విధానాల ఏంటి.? ఆయన ఎన్నికల ప్రణాళికల ఎలా ఉన్నాయి.? ఆయన అనుసరించిన వ్యూహాల ఇటువంటివి అనే చర్చ నడిచింది.

అయితే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు తో బయటకొచ్చిన కల్వకుంట్ల కవిత కూడా తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసారు. తెరాస తో తానూ తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తాను అంటూ ఆశపడుతున్న కవిత విజయ్ బాటలో నడిచేందుకు అడుగులు వేస్తున్నారు.

ADVERTISEMENT

అందులో భాగంగానే నేడు విజయ్ వ్యక్తిగత జోతిష్యుడు రిక్కీ రాధన్ కవిత ను కలిశారు. హైద్రాబాద్ లోని ఆమె నివాసంలో వీరిద్దరి భేటీ జరగడంతో కవిత కూడా విజయ్ అస్ట్రాలజర్ సూచనలు తీసుకోబోతున్నారా.? అనే కామెంట్స్ వినిపడుతున్నాయి.

విజయ్ తమిళనాడు సీఎం అవుతారంటూ గతంలో రిక్కీ చేసిన కామెంట్స్ విజయ్ సీఎం అవ్వడంతో తెగ వైరల్ అయ్యాయి. దీనితో ఒక్కసారిగా అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో రిక్కీ పేరు మారుమోగిపోయింది. దీనితో తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం మీద కన్నేసిన కవిత కూడా రిక్కీ తో భేటీ కావడంతో తెలంగాణ రాజకీయాలలో ఈ అంశం మీద చర్చ మొదలయ్యింది.

అయితే రాజకీయాలలో ఇటువంటి సెంటిమెంట్స్ కొత్తేమి కాదు. కానీ ఆ సెంటిమెంట్స్ అధికార పీఠాన్ని అందిస్తాయని అని ఆశించడం మూఢనమ్మకం అవుతుంది. గతంలో కవిత తండ్రి కేసీఆర్ కూడా రాజ్యాధికారం కోసం అనేక యాగాలు చేసారు. చివరికి ప్రజల తీర్పుతో ఫామ్ హౌస్ కే పరిమితం అవ్వాల్సి వచ్చింది.

అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్, సినీ సెలబ్రెటీల జాతకాలు చెప్పుకుంటూ వేణు అనే అస్ట్రాలజర్ కూడా బాగా ఫేమస్ అయ్యారు. అయితే 2028 తెలంగాణ ఎన్నికలలో బిఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ తధ్యం అంటూ బహిరంగ సవాళ్లు విసిరిన వేణు ఏపీలో కూడా జగన్ వైసీపీ కి మరో ఛాన్స్ అంటూ ప్రకటనలు చేసారు.

కట్ చేస్తే ఏపీలో వైసీపీ అధికారంలోకి కాదుకదా కనీసం ప్రతిఆపీసుఖంలోకి కూడా రాలేకపోయింది, ఇక తెలంగాణలో కేటీఆర్ ముఖ్యమంత్రి సంగతి పక్కనుంచితే కేసీఆర్ సీఎం హోదా కూడా విపక్ష నేతగా మారాల్సి వచ్చింది. మరి ఇపుడు రిక్కీ రాధన్ కూడా కవిత ఆశలకు తగ్గట్టుగా ఆమె పొలిటికల్ జాతకం మార్చనున్నారా.?

ADVERTISEMENT
Latest Stories