తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సోదరి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చక్కగా “అన్నయా!” అంటూ అంటూ ఎక్స్ సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్‌తో ఆమె రాజకీయంగా విభేదించినప్పటికీ అందరూ కల్వకుంట్లవారే కనుక కవిత పద్దతిగా అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారనుకోవచ్చు.
కానీ ఆమె అవకాశం చిక్కినప్పుడల్లా తండ్రి కేసీఆర్ నాయకత్వం తప్ప మరొకరి నాయకత్వం అంగీకరించబోనని చెపుతూనే ఉన్నారు. కనుక అన్న కేటీఆర్ నాయకత్వం అంగీకరించే ప్రసక్తే లేదని చేపుతున్నట్లే! అన్న నాయకత్వాన్ని అంగీకరించనని చెపుతూ, బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా వ్యవహరిస్తూ శుభాకాంక్షలు తెలిపితే స్పందిస్తారా?అంటే కాదనే అనుకోవచ్చు.
తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరుని తప్పు పడుతూ బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే, ఆమె కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. తెలంగాణ జాగృతి సభ్యులతో కలిసి రంగులు జల్లుకొని పండగ చేసుకున్నారు. పైగా ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరి సరికాదని కుండబద్దలు కొట్టారు. కనుక నేటికీ ఆమె మాటలు, వైఖరితో బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయి.
కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆమెకు దూరంగానే ఉంటున్నారు కానీ ఇంతవరకు ఆమెపై ఎటువంటి క్రమశిక్షణ చర్య తీసుకోలేదు! అలాగని ఆమెతో రాజీకి ప్రయత్నిస్తున్నట్లు లేదు.
కనుక బీఆర్ఎస్ పార్టీ అందండలు, కేసీఆర్, కేటీఆర్ ఆశీర్వాదాలు లేకపోతే తెలంగాణ రాజకీయాలలో ఆమె కేవలం ఓ ‘జీరో’ అని నిరూపించదలచుకున్నారా లేదా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి బాగోలేదు కనుక ఈవిదంగా కల్వకుంట్ల కుటుంబంలో అందరూ కలిసి ఈవిదంగా డ్రామాలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.





