మెగా కాంపౌండ్ నుండి మరో ‘కళ్యాణ్ బాబు?’

kalyan-kanuganti-mega-hero-debutమెగాస్టార్ చిరంజీవి ఇంట చిన్నల్లుడుగా అడుగుపెట్టిన కనుగంటి కళ్యాణ్ బాబు, త్వరలో సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెట్టబోతున్నారా? ఇదే ప్రశ్నను అప్పట్లో చిరంజీవిని అడిగితే… “ఛా… అలాంటిదేమీ లేదని కుండబద్దలు కొట్టినట్లు” చెప్పారు. అయితే ప్రస్తుతం ఇదే ప్రశ్న మరోసారి మెగాస్టార్ కు ఎదురైతే ఈ సారి ఆలోచించి సమాధానం చెప్తారని చెప్పడంలో సందేహం లేదు అంటున్నారు సినీ జనాలు.

మెగా కాంపౌండ్ నుండి మరో ‘కళ్యాణ్ బాబు’ సినీ తెరంగ్రేటం చేయడానికి రంగం సిద్ధమవుతోందన్న సంకేతాలు ట్రేడ్ వర్గాల నుండి వ్యక్తమవుతున్నాయి. తాజాగా కనుగంటి కళ్యాణ్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో, సినీ హీరోగా రంగప్రవేశం చేయబోతున్నాడన్న వార్తలకు బలం చేకూరుతోంది. సినీ హీరో లెవల్లో ఇచ్చిన ఈ స్టిల్ కళ్యాణ్ ఫస్ట్ సినిమాలోనిదా? అన్న ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories