కళ్యాణ్ రామ్ సినిమా కాంట్రవర్సీ… డైరెక్టర్ వెర్షన్ వేరే!

Devil Movie Issueనందమూరి కళ్యాణ్ రామ్ చేస్తున్న పీరియడ్ ఫిలిం ‘డెవిల్’ డైరెక్టర్ మార్పు పై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ముందు ఉన్న నవీన్ మేడారం కాకుండా ప్రొడ్యూసర్ అభిషేక్ నామా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గా మారడం తో వివాదం రాజుకుంది.

ఇందులో ప్రొడ్యూసర్ క్యాంపు నుండి విషయం ఏమిటో ఇప్పటికే M9 News పబ్లిష్ చేసింది. ఇప్పుడు డైరెక్టర్ కి సంబంధించిన మనుషులు చెబుతున్న మాట ఇది.

ADVERTISEMENT

“బాబు బాగా బిజీ వర్క్ అవుట్ కాలేదు. అయితే ఆహా కి చేసిన సిన్ అనే సినిమా నచ్చి అభిషేక్ డెవిల్ అవకాశం ఇచ్చారు. శ్రీకాంత్ విస్సా కథ తో ట్రావెల్ అయ్యాకా చాలా కొత్తగా తయారయ్యింది. దానితో స్క్రీన్ ప్లే, డైరెక్టర్ నవీన్ కి ఇచ్చేలా అనుకున్నారు. అలాగే ముందు వచ్చిన పబ్లిసిటి మెటీరియల్ లో ఉంది కూడా”.

“అయితే సినిమా స్పాన్ పెరిగే కొద్దీ అభిషేక్ లో మార్పు వచ్చింది. నవీన్ కి ఇబ్బందులు మొదలయ్యాయి. అయినా మొత్తం షూట్ పూర్తి చేశాడు. మొన్న ఆ మధ్య జరిగిన ఒక్క రోజు (డ్రాగన్ ప్రకాష్ తో) షూట్ తప్ప అంతా నవీన్ ఉన్నాడు. మొదటి షెడ్యూల్ కే తీసెయ్యడం అనేది తప్పు”.

“ఈ లోగా ఒక ప్రొడ్యూసర్ నవీన్ కి కోటి రూపాయిల అడ్వాన్స్ ఇచ్చాడు. ఎటువంటి అగ్రిమెంట్ లేకపోయినా రెమ్యూనరేషన్ లో సగం ఇవ్వాలని ప్రొడక్షన్ నుండి ఒత్తిడి వస్తుంది. కాదని ప్రతిఘటించడం తో విషయం ఇక్కడి దాకా వచ్చింది”.

అసలు ఈ విషయంలో హీరో కళ్యాణ్ రామ్ స్టాండ్ ఏంటి?

“ఆయన ముందులో డైరెక్టర్ కి ఫర్ గానే ఉన్నారు. అభిషేక్ తో మాట్లాడతా అని మాటిచ్చారు. అయితే తరువాత గోడ మీద పిల్లిలా ఉండిపోయారు. అమిగోస్ ప్లాప్ తరువాత ఈ సినిమా బాగా రావడంతో ఆయన అనవసరమైన వివాదాల్లోకి వెళ్లి సినిమా కి ఇబ్బందులు తెచ్చే మూడ్ లో లేరు అందుకే అటు ఇటు కాకుండా తటస్థంగా ఉండిపోయారు. ఈ సినిమా నవీన్ మూడు సంవత్సరాల కష్టం”.

అయితే అటు అభిషేక్ నామా, ఇటు నవీన్ వెర్షన్లు కంప్లీట్ గా అపోజిట్ గా ఉన్నాయి. ఈ విషయం ఎంత వరకూ వెళ్తుందో ఎవరిది తప్పు, ఎవరిది రైట్ అనేది ఎలా తేలుతుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories