కళ్యాణ్ రామ్ కోరిక తీర్చలేకపోయిన హరికృష్ణ!

Nandamuri Harikrishna Kalyan Ram - Jr NTRఅక్కినేని ఫ్యామిలీ గర్వించదగ్గ సినిమాగా “మనం” ఎలా అయితే చరిత్రలో నిలిచిపోయిందో, అదే విధంగా తమ కుటుంబంలోని హీరోలతో కలిసి ఓ సినిమాను నిర్మించాలని కళ్యాణ్ రామ్ భావించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తండ్రి హరికృష్ణతో కలిసి తాను, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి ఒక సినిమా తీయాలని కళ్యాణ్ రామ్ గత కొన్నాళ్ళుగా అనుకుంటున్నట్లుగా సమాచారం.

[m9ad]

ADVERTISEMENT

ఇదే విషయాన్ని పలువురు ప్రముఖ రచయితల వద్ద ప్రస్తావించి, అందుకు తగిన విధంగా కధను కూడా సిద్ధం చేయమన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ కళ్యాణ్ రామ్ భావించిన ముగ్గురిలో తండ్రి పాత్రకు ఇక అవకాశం లేకుండా పోయింది. దీంతో కళ్యాణ్ రామ్ కోరిక తీరకుండానే హరికృష్ణ అనంతలోకాలకు వెళ్ళిపోయారు. ఈ సమయంలో సినిమాల ప్రస్తావన తగదు గానీ, కళ్యాణ్ రామ్ కు ఈ కోరిక చాలా బలంగా ఉండేదని టాలీవుడ్ వర్గాలు గట్టిగా చెప్తుండడంతో, దీనికి ప్రాధాన్యత లభిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories