క్రిష్ ‘కంచె’ను వరించిన జాతీయ అవార్డు!

Kanche bags best regional film awardసామజిక చిత్రాల సృష్టికర్త క్రిష్ సినిమాలకు ఆడియన్స్ ఎలా స్పందించినా విమర్శకులు మాత్రం అవార్డులతో స్వాగతం పలుకుతారు. ఇప్పటికే తాను దర్శకత్వం వహించిన సినిమాలకు జాతీయ అవార్డులు అందుకున్న క్రిష్, ఇటీవల మెగా వారసుడు వరుణ్ తేజ్ తో తెరకెక్కించిన “కంచె” సినిమాకు మరో జాతీయ అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ADVERTISEMENT

ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రాల విభాగాలలో తెలుగుకు గానూ ‘కంచె’ సినిమా అవార్డు కొల్లగొట్టింది. స్వాతంత్ర్య సమరం నాటి కాలంలో తెరకెక్కిన ఈ అద్భుత ప్రేమగాధకు ప్రేక్షకుల కూడా ఆదరించినప్పటికీ, ఆశించిన ఫలితాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఇక, దేశవ్యాప్తంగా ఉత్తమ చిత్రంగా ఎంపికైన ‘బాహుబలి’ సినిమా, స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ సత్తా చాటి అవార్డును సొంతం చేసుకుంది.

ADVERTISEMENT
Latest Stories